బ్రేకింగ్ న్యూస్...బైకును ఢీకొన్న కారు..
By
Peoples Motivation
బ్రేకింగ్ న్యూస్...బైకును ఢీకొన్న కారు
-ఉదయం ఘటన మరువక ముందే అదే సమీప ప్రాంతంలో సాయంకాలం మరో ఘటన
-ఈ రోజు ఉదయమే ఈ ఘటన జరిగిన సమీపంలో 70 గొర్రెలను ఢీకొన్న లారీ
-అతివేగం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదాలు దీనిపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది...
ప్రొద్దుటూరు, ఫిబ్రవరి 13 (పీపుల్స్ మోటివేషన్):-
పొద్దుటూరు పట్టణ రూరల్ పరిధిలోని చౌడూరు గ్రామ సమీపంలో కారు బైకును ఢీకొన్న ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన గోడ రామాంజనేయులు, మహేశ్వర్ రెడ్డి గాయపడ్డారు. కారు బైకును ఢీకొనడంతో బైకు కొంత దూరంలో ఎగిరిపడినది. సమీపానున్న ప్రజలు అప్రమత్తమై క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.వీరు పని నిమిత్తం జమ్మలమడుగు నుంచి తిరుగు వస్తుండగా వారి ఊరి సమీపంలోనే ఈ ఘటన జరగడం దురదృష్టకరం.
ఈ సంఘటన విషయం తెలుసుకున్న రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఈ ఘటనకు కారణమైన వారిని విచారించే పనిలో ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments