300 యూనిట్ల ఫ్రీ కరెంట్...ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన...
300 యూనిట్ల ఫ్రీ కరెంట్...ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన...
ఢిల్లీ, (పీపుల్స్ మోటివేషన్):-
స్థిరమైన అభివృద్ధి ప్రజల శ్రేయస్సు కోసం ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఈ పథకం ద్వారా కోటి గృహాల్లో 75 వేల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతినెల 300 యూనిట్ల సౌర విద్యుత్ తో వెలుగు అందిస్తామని వెల్లడించారు. కోటి ఇళ్లపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి వినియోగాన్ని పెంపొందిస్తామని పేర్కొన్నారు. ఈ పథకం కోసం pmsuryaghar.gov.in చేసుకోవాలని దీని కింద "రూప్ టాప్ సోలార్" కోసం ఇలా దరఖాస్తు చేసుకోవాలో ఆ వివరాలను వెబ్సైట్లో పొందుపరిచారు.
ఈ పథకం కొరకు క్రింది విధంగా దరఖాస్తు చేసుకోగలరు.
👉 ముందుగా ఈ పోర్టల్ లో మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తరువాత మీ రాష్ట్రం మీరు విద్యుత్తును పొందే కంపెనీని ఎంచుకోవాలి.
👉 మీ విద్యుత్ కనెక్షన్ కన్జ్యూమర్ నెంబర్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడి ఎంటర్ చేసి పోర్టల్ లో ఉన్న నియమ నిబంధనలను అనుగుణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
👉 ఆ తర్వాత కన్జ్యూమర్ నెంబర్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి రూప్ టాప్ సోలార్ అప్లై చేసుకోవాలి.
👉 దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసి డిస్కమ్ నుంచి అనుమతులు వచ్చే వరకు వేచి ఉండాలి. అనుమతి వచ్చిన తర్వాత మీ డిస్కంలోని నమోదిత విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి.
👉 ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత ఆ ప్లాంట్ వివరాలను పోర్టల్ లో సబ్మిట్ చేసి మీటర్ కోసం అప్లై చేసుకోవాలి
👉 నెట్ మీటర్ ను ఇన్స్టాల్ చేశాక డిస్కమ్ అధికారులు తనిఖీ చేస్తారు అనంతరం పోర్టల్ నుంచి కమిషన్ సర్టిఫికెట్ ఇస్తారు.
👉 ఈ నివేదిక పొందిన తర్వాత మీ బ్యాంకు ఖాతా వివరాలతో పాటు క్యాన్సిల్ చెక్కును వెబ్సైట్లో సబ్మిట్ చేయాలి నెల రోజుల్లోగా మీ ఖాతాలో సబ్సిడీ జమ చేస్తారు.
ఈ విధంగా పర్యావరణ రహిత విద్యుత్తును పొందడానికి ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.