ఏసీబీ అయితే నాకేంటి... అధికారులపై గరం గరం
ఏసీబీ అయితే నాకేంటి... అధికారులపై గరం గరం
ఏసీబీ వలలో అవినీతి అధికారి
సమాచారం బయటకు రానీయకుండా ఓ మహిళా అధికారి విశ్వప్రయత్నాలు
15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మార్కెట్ యార్డ్ సూపర్ వైజర్
కర్నూలు/ ఎమ్మిగనూరు, ఫిబ్రవరి 22 (పీపుల్స్ మోటివేషన్):-
ఈరోజు ఎమ్మిగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏసీబీ దాడులు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఓ మహిళా అధికారి. మార్కెట్ యార్డ్ సూపర్వైజర్ ఉమా మహేశ్వరిని 15000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కింది. కూరగాయల హోల్ సేల్ లైసెన్సు మంజూరు పత్రం ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిందని పక్క వివరాలతో దాడి చేశారు. అధికార పార్టీ వాళ్లు తెలుసు మీ అంతు చూస్తాను అంటూ ఏసీబీ అధికారులను భయపెట్టిన మహిళా అధికారి. విషయం బయటకు రావడంతో ఆ మహిళా వెనకాల ఉన్న నేతలు సైలెంట్ అయిపోయినట్లు సమాచారం. ఈ దాడిలో పట్టుబడిన సూపర్వైజర్ ను ఏసీబీ డిఎస్పి వెంకటాద్రి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.