వైయస్సార్సీపి ప్రభుత్వలోనే పేదలకు జీవితాల్లో వెలుగు - ఆర్థికశాఖ మంత్రి బుగ్గన
వైయస్సార్సీపి ప్రభుత్వలోనే పేదలకు జీవితాల్లో వెలుగు - ఆర్థికశాఖ మంత్రి బుగ్గన
- 3081 మందికి 4664 ఎకరాలు సంపూర్ణ భుహక్కు పత్రాలు పంపిణీ చేశాం.
- రూ 60లక్షలతో వెజిటబుల్ మార్కెట్ యార్డు ప్రారంభం
బేతంచెర్ల, ఫిబ్రవరి 22 (పీపుల్స్ మోటివేషన్):-
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రాష్ట్రంలో పేద ప్రజల జీవితాల్లో సూర్యోదయం మొదలైందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ అన్నారు.గురువారం పట్టణ సమీపంలోని కొలుములపల్లె రహదారిలో రూ 60 లక్షలతో నిర్మించిన వెజిటేబుల్ కూరగాయల మార్కెట్ యార్డును ఆర్థిక శాఖ మంత్రి ప్రారంభించారు. అనంతరం సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో కుల మతాలు చూడకుండా పారదర్శకంగా ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనారిటీ,ఓసిల వర్గాలన్నింటికీ మేలు చేశామని అన్నారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మార్కెట్ యార్డ్ నిర్మించడంతో వ్యాపారధారుల కష్టాలు తీర్చమని అన్నారు.త్వరలోనే వాటర్ గ్రిడ్జ్ పథకం కింద బేతంచెర్లకు ప్రతి ఇంటికి కృష్ణ జలాలు వస్తాయని అన్నారు. మండలంలో జగనన్న భూ శాశ్వత హక్కు భూ రక్ష పథకం క్రింద ముద్దవరం,ఎం పెండకల్, ఆర్ఎస్ రంగాపురం,గోరుమానకొండ, బుగ్గానపల్లి,గొర్లగుట్ట,ఎంబాయ్,కొలుములపల్లె, గుటుపల్లె,ఆర్ కొత్తపల్లె,బేతంచెర్ల గ్రామాలలోని 20 ఏళ్లకు పైగా అనుభవంలో ఉన్న రైతుల డీ పట్టా భూములు,చుక్కల భూములకు సుమారు 3081 మంది రైతులకు 4664 ఎకరాలకు సంపూర్ణ భూహక్కు పత్రాలను పంపిణీ చేశామని తెలిపారు.బాబు ష్యూరిటీ భవిష్యత్ కు గ్యారెంటీ పథకం బూటకమని,బాబుకే గ్యారెంటీ లేనప్పుడు పథకాలు ఎక్కడని,గత ప్రభుత్వంలో ఇచ్చిన హామిలీకే దిక్కు లేదని విమర్శించారు.డోన్ టిడిపి ఇంచార్జి హోదాలో ధర్మవరం సుబ్బారెడ్డి తమ సొంత నిర్ణయంగా పేద ప్రజలకు సెంటున్నార స్థలం ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారని,పట్టణంలోని సుమారు12 వేల రేషన్ కార్డులు ఉండగా వారికి ఇవ్వాలన్న 300 ఎకరాలు ఎక్కడ ఎలా ఇస్తారో చెప్పాలని,ఎకరా కనీసం రూ.కోటి వేసుకున్న రూ.300 కోట్లు ఖర్చు పెడతారా అని విమర్శించారు.ఆర్థికమంత్రి ఓడిపోతామని ప్రారంభాలు చేస్తున్నారని విమర్శించే ప్రతిపక్ష నాయకుడు నాపై పోటీ చేయడానికి ముందు టికెట్ తెచ్చుకోవాలని ఎద్దేవాచేశారు.ప్రజల ఆశీర్వాదంతోనే డోన్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేశామని అన్నారు.ప్రజాలకుమేలు చేసివుంటేనే ఓటేయమని అడిగిన ముఖ్యమంత్రి దేశంలో వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి,గిడ్డంగుల కార్పొరేషన్ డైరెక్టర్ బాబురెడ్డి,మద్దిలేటిస్వామి ఆలయ చైర్మెన్ బి.సీత రామచంద్రుడు,మైనారిటీ కార్పొరేషన్,ఉర్దూ అకాడమీ సభ్యులు మూర్తుజవాలి,ఖాజా హుస్సేన్,వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ మురళీకృష్ణ,కమిషనర్ ఎల్.రమేష్ బాబు,డిప్యూటీ తహశీల్దార్ సత్యదీప్,ఆర్ఐ శ్రీదేవి,కౌన్సిలర్లు,పిట్టల జాకీర్ హుస్సేన్.గోర్మన్ కొండ సర్పంచ్ కోడె వెంకటేశ్వర్లు అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.