ధ్రువీకరణ పత్రాలపై ఎదురయ్యే సమస్యల గురించి అవగాహన కార్యక్రమం...
ధ్రువీకరణ పత్రాలపై ఎదురయ్యే సమస్యల గురించి అవగాహన కార్యక్రమం...
జనన ధ్రువీకరణ పత్రం 21 రోజుల్లో నమోదు చేసుకోవాలి
మరణ, కుల, ధ్రువీకరణ పత్రములను సచివాలయ వ్యవస్థ ద్వార 15 రోజుల్లో పొందవచ్చు
వివాహం చేసుకుంటే ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి
డిఎల్ఎస్ఎ కార్యదర్శి సిహెచ్.వెంకట నాగ శ్రీనివాసరావు
కర్నూల్ న్యూస్, ఫిబ్రవరి 22 (పీపుల్స్ మోటివేషన్):-
గురువారం 22-02-2024 తేదీన జననం, మరణం, వివాహం, ఆదాయం, కులం ధ్రువీకరణ పత్రాలపై ఎదురయ్యే సమస్యల గురించి కర్నూలు నగరంలోని స్థానిక జిల్లా కోర్ట్ లోని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సమావేశంకి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సిహెచ్. వెంకట నాగ శ్రీనివాసరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే. విశ్వేశ్వర రెడ్డి, ఎంపీడీవోలు పి.జయశ్రీ, ఎం.దివ్య, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జననం, మరణం, వివాహం, ఆదాయం, కులం ధ్రువీకరణ పత్రాలు ఎలా పొందాలని మరియు ఎలాంటి అర్హతలు ఉండాలని వాటిపై సంబంధిత అధికారులు ఈ విధంగా తెలియజేశారు. వివాహ చట్టం ప్రకారం ఎవరైనా సరే వివాహం చేసుకుంటే ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలని, అలా రిజిస్టర్ చేసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని ఉదాహరణకు పాస్ పోర్ట్ మొదలైన వాటికి ఉపయోగపడుతుందని అన్నారు, అలాగే జనన ధ్రువీకరణ పత్రం ఇరవై ఒక్క రోజు లోపల నమోదు చేసుకోవాలని, అలాగే మరణ ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ, ఆదాయం ధ్రువీకరణ పత్రములను సచివాలయంలో నమోదు చేసుకున్నాక, సచివాలయం వ్యవస్థ ద్వార 15 రోజుల్లో పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, పార లీగల్ వాలంటరీస్, న్యాయ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.