బాల్క సుమన్ వ్యాఖ్యలపై భగ్గుమన్న భూర్గంపహాడ్ కాంగ్రెస్ నాయకులు
బాల్క సుమన్ వ్యాఖ్యలపై భగ్గుమన్న భూర్గంపహాడ్ కాంగ్రెస్ నాయకులు
భూర్గంపహాడ్, ఫిబ్రవరి 06 (పీపుల్స్ మోటివేషన్):-
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలుచేస్తూ బహిరంగంగా మీడియా ముఖంగా చెప్పుచూపిస్తూ దుర్భషలాడిన బి.ఆర్.యస్ నాయకులు బాల్క సుమన్ తీరుపై భూర్గంపహాడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి నేతృత్వంలో మండల కమిటీ సమన్వయంతో పార్టీ కార్యాలయం వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసిఆర్ కాళ్ల దగ్గర చెప్పులు మోసే పనికిమాలిన బి.ఆర్.యస్ నాయకులు బాల్క సుమన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి కాదని......ఎవరి మెప్పుకోసం మాట్లాడారో ఎందుకు ఆ రీతిలో మాట్లాడారో తెలంగాణ ప్రజానీకానికి తెలుసునని....వెంటనే క్షమాపణ చెప్పకపోతే త్వరలోనే మా కాంగ్రెస్ కార్యకర్తలు మీకు గుణపాఠం చెప్పడం ఖాయమేనని....మా నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి కనుసైగా చేస్తే ఏమైపోతారో ఓసారి మీ దొర కేసీఆర్ ని అడిగి తెలుసుకోవాలని....ఉస్మానియా యూనివర్సిటీలో నువ్వు విద్యార్థులను అడ్డంపెట్టుకుని కేసీఆర్,కేటీఆర్,కవిత ఏజెంట్ గా అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఎన్ని కుంభకోణాలు చేశావో త్వరలోనే అన్నీ బయటకొస్తాయని....కేసిఆర్ చెప్పులు మోసే గడీలబానిసైన నిన్ను త్వరలోనే వందలాది చెప్పులతో సన్మానించక తప్పదని,వెంటనే మా నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఓ ప్రకటనలో వారు డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలోభూర్గంపహాడ్ పట్టణ అధ్యక్షులు మందా నాగరాజు,టీపీసీసీ సభ్యులు తాళ్ళూరి చక్రవర్తి,నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షురాలు బర్ల నాగమణి,మాజీ మండల అధ్యక్షులు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పూలపెళ్లి సుధాకర్,గుండె వెంకన్న ,దాసరి సాంబ,సెనగా కిషోర్,మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు రేణుక,సుగుణ,యువజన కాంగ్రెస్ నాయకులు హరీష్ యాదవ్,కుమార్,బూర్గంపహాడ్ కాంగ్రెస్ శ్రేణులు చిప్ప రాజు,ఛోటే,నాగమురళి,పాషా,హుస్సేన్,రాము,బుచ్చమ్మ,లక్ష్మణ్,రాజు,సతీష్, ఎస్సీ,ఎస్టీ,బిసి మైనారిటీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.