మెగా డిఎస్సీ కాదు... దగా డిఎస్సీ
టిడిపి ప్రభుత్వంలో పెట్టుబడులు... జగన్ రెడ్డి పాలనలో గంజాయి.మెగా డిఎస్సీ కాదు... దగా డిఎస్సీ -ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి.
డోన్, ఫిబ్రవరి 04 (పీపుల్స్ మోటివేషన్):-
రాష్ట్రంలో వనరుల్నీ దోపిడీ కి గురై అరాచకం రాజ్యమేలుతుందనీ డోన్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి అన్నారు. తెలుగుదేశంపార్టీ రాష్ట్రానికి కంపెనీలు తెస్తే... జగన్ రెడ్డి ప్రభుత్వం గంజాయి తెచ్చాడని. అధికార వైకాపా నేతల కనుసందుల్లో రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా స్మగ్లింగ్ జరుగుతుందని, దీని వలన యువత జీవితాలు నాశనం అవుతున్నాయని అన్నారు. తెలుగుదేశంపార్టీ అధికారంలో పెట్టుబడులలో మొదటి స్థానంలో ఉంటే... నేడు వైకాపా పాలనలో స్మగ్లింగ్ లో ముందు వరుసలో నిలవడం సిగ్గుచేటు అని అన్నారు.
జగన్ రెడ్డి వదిలింది మెగా డిఎస్సీ కాదు... దగా డిఎస్సీ. 50,892 ఖాళీలుంటే, 6100 పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగులను వంచించడమే అని అన్నారు. డిఎస్సీ పేరుతో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జగన్ రెడ్డి కొత్త డ్రామాకు తెర తీశాడు. జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని నాలుగున్నరేళ్ళుగా చేసింది ఏమీలేదని అన్నారు. జగన్ సభ కోసం ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేయడం దారుణమని, జగన్ రెడ్డి ఎన్ని డ్రామాలు చేసిన రానున్న ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని అన్నారు.