సిద్ధం బహిరంగ సభను విజయవంతం చేయండి
Siddam news, ap news, political news, Kurnool news, anantapur news
By
Peoples Motivation
సిద్ధం బహిరంగ సభను విజయవంతం చేయండి
-మండల కన్వీనర్ కప్పట్రాళ్ల మల్లికార్జున
దేవనకొండ ఫిబ్రవరి 16 (పీపుల్స్ మోటివేషన్):-
ఈనెల 18 ఆదివారం అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో జరిగే సిద్ధం కార్యక్రమం విజయవంతం చేయాలని ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండల పరిధిలోని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెస్ట్ హౌస్ నందు ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగినది
ఈ సందర్భంగా మండల కన్వీనర్ కప్పట్రాళ్ల మల్లికార్జున మాట్లాడుతూ ఈనెల 18న జరిగే సిద్ధం కార్యక్రమానికి దేవనకొండ మండలం నుంచి అత్యధికంగా తరలిరావాలని పిలుపునివ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తపాల శ్రీనివాసులు నాయుడు, పాలకుర్తి ప్రతాప్, వెలమకూర్ రామచంద్ర, పల్లె దొడ్డి చంద్ర, ఉరుకుందు, లింగన్న, వెంకటస్వామి ,పొట్లపాడు ఆనంద్ , సహదేవ్ , కొత్తపేట సర్పంచ్ బాబు, కుంకునూరు గ్రామ వైసిపి నాయకులు రామప్ప, రంగన్న, పరమేష్, కిషోర్ , దేవనకొండ వైసీపీ యువ నాయకులు జనార్దన్ నాయుడు చిన్నారెడ్డి వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Comments