ఘనంగా శ్రీ కృష్ణ దేవరాయలు పట్టాభిషేక ఉత్సవాలు..
AP NEWS, SRI KRISHNADEVARAYALA JAYANTI TRADITIONAL NEWS, KADAPA NEWS, PRODDATUR NEWS
By
Peoples Motivation
ఘనంగా రాజులకే రాజు, రారాజు మహారాజు, శ్రీ శ్రీ శ్రీ శ్రీకృష్ణదేవరాయల... పట్టాభిషేక మరియు జయంతి మహోత్సవ కార్యక్రమం..
-ప్రొద్దుటూరు పట్టణ బలిజ సంఘం గౌరవ అధ్యక్షులు గుమ్మటమయ్య
ప్రొద్దుటూరు, ఫిబ్రవరి 16 (పీపుల్స్ మోటివేషన్):-
ఈ రోజు ప్రొద్దుటూరు పట్టణములోని పుట్టపర్తి సర్కిల్ దగ్గర శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేక మరియు జయంతి ఉత్సవాల సందర్భంగా విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలదండలు వేసి విగ్రహాన్ని సత్కరించారు.
ఈ సందర్భంగా ప్రొద్దుటూరు బలిజ సంఘం గౌరవ అధ్యక్షులు గుమ్మటమయ్య మాట్లాడుతూ క్రీస్తుపూర్వం నుండి మనము శ్రీకృష్ణదేవరాయలు వారి పట్టాభిషేకము రోజునే వారి జయంతి ఉత్సవం జరుపుకొనుచున్నామని, ఎందుకంటే ఆయన పుట్టినరోజు వివరాలు తెలియనందున ఈ మధ్యకాలంలో ఎన్నో శిలా శాసనాలు దొరికాయి. అందులో శ్రీ కృష్ణదేవరాయల వారి జన్మదినం లభించినది. ఆ శిలా శాసనంలో జనవరి 15న అని ఈ మధ్యకాలంలో జనవరి 15నే ఆయన జయంతి ఉత్సవాలను జరుపుకొనుచున్నారు. కానీ కర్ణాటకలోని ఆయన వారసులు మాత్రం ఫిబ్రవరి 16వ తేదీనే రాయలవారి జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నారు. అందుకు అనుగుణంగా ప్రొద్దుటూరు పట్టణం బలిజ సంఘం పెద్దలు కూడా శ్రీకృష్ణదేవరాయల వారి పట్టాభిషేకం మరియు జయంతి ఉత్సవాలను కలిపి ఈ రోజు చేసుకోవడం జరిగినది.
సానె గిరిబాబు రాయల్
పీపుల్స్ మోటివేషన్ తెలుగు డైలీ
కడప జిల్లా ఇంచార్జ్..✍️
Comments