ఘనంగా జరిగిన పల్లెకు పోదాం శిక్షణ కార్యక్రమం
ఘనంగా జరిగిన పల్లెకు పోదాం శిక్షణ కార్యక్రమం- కొట్టె మల్లికార్జున
డోన్ (పీపుల్స్ మోటివేషన్):-
ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, జిల్లా అధ్యక్షురాలు బైరెడ్డి శబరి, క్లస్టర్ ఇంఛార్జి సావిత్రమ్మ, ఇంటి ఆది నారాయణ ఆదేశాలతో జిల్లా కన్వీనర్ నటేశ్, కో.కన్వీనర్
రామకృష్ణారెడ్డి, కో కన్వీనర్ కొట్టె మల్లికార్జున సమన్వయంతో
పల్లెకు పోదాం కార్యక్రమం జలదుర్గంలో డోన్ నియోజకవర్గం కన్వీనర్ సందు వెంకటరమణ ఆధ్వర్యంలో మరియు ప్యాపిలి మండల అధ్యక్షులు దామోదర్ నాయుడు అధ్యక్షతన, ముఖ్య అతిథులుగా జిల్లా ఉపాధ్యక్షులు కిరణ్, ఎస్టి మోర్చా అధ్యక్షులు దేవేంద్ర, రూరల్ మండల అధ్యక్షులు రవికుమార్, జిల్లా ఓబీసీ మోర్చ ప్రధాన కార్యదర్శి అశోక్, మాజీ కార్యదర్శి రామచంద్ర నాయుడు అలాగే గ్రామ పంచాయతీల కన్వీనర్లు కేసి మద్దిలేటి, కో కన్వీనర్ ఒబయ్య సహకారంతో గ్రామ స్థాయి కార్యకర్తలు శిక్షణ కార్యక్రమం జరిగింది. శిక్షణ కార్యక్రమంలో "ఫిబ్రవరి 9,10,11"న "పల్లె పల్లెకు బిజెపి గడప గడపకు బిజెపి" చేరువ కావడానికి ముఖ్య సూచనలను డోన్ నియోజకవర్గం కన్వీనర్ సందు వెంకటరమణ, జిల్లా ఉపాధ్యక్షులు కిరణ్, నంద్యాల జిల్లా పల్లెకు పోదాం కో-కన్వీనర్ కొట్టె మల్లికార్జున, ప్యాపిలి మండల అధ్యక్షులు దామోదర్ నాయుడు, మండల కన్వీనర్ కేసి మద్దిలేటి, కో కన్వీనర్ ఒబయ్య అలాగే పాల్గొన్న గ్రామ పంచాయతీ, నాయకులు తమ అభిప్రాయాల్ని తెలియచేశారు.
గావో చలో అభియాన్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ గావ్ చలో అభియాన్ కార్యక్రమం జిల్లా కో-కన్వీనర్&డోన్ నియోజకవర్గం బిజెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జున ధన్యవాదాలు తెలిపారు.