నిరుపేద క్రీడాకారుడికి ఆర్థిక సహాయం చేసిన సీఐ ప్రవీణ్ కుమార్
Police news, general news, ap news, political news,
By
Peoples Motivation
నిరుపేద క్రీడాకారుడికి ఆర్థిక సహాయం చేసిన సీఐ ప్రవీణ్ కుమార్
డోన్, ఫిబ్రవరి 11 (పీపుల్స్ మోటివేషన్):-
హైదరాబాద్ లో జరుగనున్న నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు నంద్యాల జిల్లా డోన్ మండలం కొచ్చేర్వు గ్రామానికి చెందిన 56ఏళ్ల నారాయణ స్వామి ఎంపిక అయ్యారు. నారాయణ స్వామి వృత్తి రీత్యా ఆటో డ్రైవర్ గా కుటుంబాన్ని పోషిస్తూ స్ఫూర్తి సేవా సమితి సంస్థలో సభ్యుడిగా కొనసాగుతూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వుంటారు. ఈనెల హైదరాబాద్ లో జరుగుతున్న నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ కి అండర్-60 విభాగంకి సెలెక్ట్ అవ్వగా ఆర్థిక కారణాల వలన పోలేకపోతున్నానని తెలుపగ స్పందించిన స్ఫూర్తి సభ్యులు స్ఫూర్తి దాతల సహకారంతో ఆరువేల రూపాయల ఆర్ధిక సహకారాన్ని అందించి అతడు పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ పంపించారు.
ఈ ఆర్థిక సాయన్ని డోన్ పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా నారాయణ స్వామికి అందించారు. ఆరుపదుల వయసులో క్రీడల్లో అద్భుతంగా రాణిస్తున్న నారాయణ స్వామిని అభినందిస్తూ సీఐ కొంత ఆర్థిక సాయం అందించారు. ఎంతోమంది యువతకు నారాయణ స్వామి స్ఫూర్తిదాయకమని నేటి తరం యువత క్రీడల్లో రాణించి మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహిస్తున్న స్ఫూర్తి సేవా సమితి సభ్యులను, దాతలను సీఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు స్ఫూర్తి మధు, రాము, ఉప్పర్లపల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Comments