రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

డోన్ అసెంబ్లీ ఎన్నికలకు సైకిల్ ఎక్కేదెవరో..?.. మన్నే..నేనా

political news, mla news, tdp news
Peoples Motivation


డోన్ అసెంబ్లీ ఎన్నికలకు సైకిల్ ఎక్కేదెవరో..?.. మన్నే..నేనా



ప్యాపిలి, ఫిబ్రవరి 06 (పీపుల్స్ మోటివేషన్):-

గత కొన్నిరోజులుగా రెండు రాజకీయ పార్టీల నాయకుల్లోనే గాక అసెంబ్లీ స్థాయిలోని టీడీపీ అనుయాయుల్లోనూ ఉత్కంఠ వాతావరణంలో కొట్టుమిట్టాడుతున్నారు. నంద్యాల జిల్లాలోని జనసేన, టీడీపీ, వైస్సార్సీపీల రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఉమ్మడి కర్నూల్ జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాలలో టిడిపి అభ్యర్థులను ప్రకటించిటానికి సిద్ధంగా ఉన్నా ఆలూరు, ఆదోని, కోడుమూరు, డోన్, ఆళ్లగడ్డ, నంద్యాల, నియోజకవర్గాలలో మాత్రం ఇప్పటికి అభ్యర్ధులను ఖరారు చేయలేదు. తెదేపా ప్రకటన ఎవరివైపు మొగ్గు చూపుతుందో అంటూ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. డోన్ అసెంబ్లీ నియోజకవర్గపు ఇంచార్జ్ గా ఉన్న మన్నె సుబ్బారెడ్డి (ధర్మారం సుబ్బారెడ్డి) 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం తెదేపా పార్టీలోని కొందరు ఆయనపై అధినేత చంద్రబాబునాయుడుకు ఉన్నవి లేనివి చెప్పి ఆయనను పార్టీకి దూరం చేసారు. దీంతో ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ పార్టీలకు అతీతంగా ఆయన వద్దకు వచ్చిన వారికి చేతనైనంత వరకు సాయం చేస్తూ వచ్చారు. దీంతో చాలా కాలం పాటు డోన్ అసెంబ్లీ కి తెదేపా ఇన్చార్జ్ కరువయ్యాడు. ఆ తర్వాత పర్యటనలో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ధర్మవరం సుబ్బారెడ్డి కి నియోజకవర్గ ఇన్చార్జ్ పగ్గాలు ఇస్తూ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ నియమించారు. నాటినుండి అలుపెరగక గ్రామం, వాడ, వీధి అనే వ్యత్యాసం లేకుండ ఆయన పార్టీలోని దాదాపు అందరితో మమేకమై పోతూ, అధికార పార్టీని ఎండగడుతూ టీడీపీ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. యువగళంలో పాల్గొని భారీ స్థాయిలో ఖర్చు పెట్టినట్లు కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. పార్టీ టిక్కెట్ కోసం తీవ్రంగా కృషిచేస్తూ పార్టీలోని అన్ని వర్గాల ప్రజలతో అందుబాటులో ఉంటూ సాయం చేస్తున్నారు. అదే విధంగా పార్టీ టిక్కెట్ కోసం తీవ్రంగా కృషిచేస్తున్నట్లు కూడా సమాచారం. ఒకానొక సమయంలో టిక్కెట్ ఖరారు అయిందని ఊహాగానాల్లో ఆయన అభిమానుల్లో సందడి నెలకొంది. పురవీధుల్లో బాణసంచాతో సంబరాలు కూడా చేశారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అధికార పార్టీ నాయకులపై పైచేయి సాధించాలంటే అన్ని వర్గాలను కలుపుకుని ఒక్కతాటి మీదకు తెచ్చిన మన్నె సుబ్బారెడ్డి టీడీపీ అభ్యర్థిగా ప్రకటిస్తే బాగుంటుందని పార్టీకి అనుకూలంగా ఉంటుందని, ఆయన అయితేనే చేయగలడు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. సుబ్బారెడ్డికి అధికార పార్టీ నాయకులతో కూడా మంచి సంబంధాలు కలిగి ఉండటంతో పాటు టిడిపి అభ్యర్థిగా టిక్కెట్ వస్తే వైసిపిలోని కొంతమంది నాయకులు కూడా ఆయనకు సహాయ సహకారాలు అందించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. కొంతమందిని పక్కన పెట్టుకొని మిగిలిన వారిని దూరం చేస్తున్నారనే నెపంతో ఆ పార్టీలోని కొంతమంది నాయకులు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఇంకొక అడుగు ముందుకు వేసి ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన వారిని దూరం పెడుతున్నాడంటూ ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఏర్పడి పార్టీకి నష్టం జరుగుతుందని పలువురు అంటున్నారు. ఇలాగే కొనసాగితే పార్టీకి భారీ నష్టం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అదే విధంగా అధినేత చంద్రబాబునాయుడు వద్ద తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రయోగాలు చేసి గెలిచే టిక్కెట్ను పోగొట్టుకోలేమని పార్టీకి సేవలు అందించండి. పార్టీ అధికారంలోకి వస్తే తగిన సముచిత స్థానం కల్పిస్తామని చెప్పినట్లు సమాచారం. ఈఇద్దరులో........

ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తే గెలుపొందే అవకాశాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు అంటున్నారు. అయితే అధిష్టానం కూడా ఆయన వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. వీలైనంత త్వరలో అభ్యర్ధులను ప్రకటిస్తే ఇప్పటి నుంచే అసంతృప్తులను కలుసుకోవడమే కాకుండా అధికార పార్టీలోని అసంతృప్తులను తమ వైపుకు తిప్పుకొని రానున్న ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని పలువురు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో........ సరైన అభ్యర్థి అని విశ్లేషకులు అంటున్నారు. అధినేత చంద్రబాబునాయుడు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.

Comments
User
Comment Poster
Hi

-Advertisement-