ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదం ఏర్పడనుందా..? జర్నలిస్టులకు, పత్రికా యాజమాన్యాలకు రక్షణ లేదా..?
ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదం ఏర్పడనుందా..? జర్నలిస్టులకు, పత్రికా యాజమాన్యాలకు రక్షణ లేదా..?
-బిజెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జున
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి జరుగకపోగా, అభివృద్ది, సంక్షేమం పేరుతో అప్పులు, ఆర్థిక లోటుతో దివాలా తీసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనే విషయం తెలిసిందే.బిజెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ నిన్న కాక మొన్న అనంతపురం జిల్లాలో రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభ సందర్భంగా వైసీపి నాయకులు , అల్లరి మూకలు ఆంధ్రజ్యోతి విలేకరిపై దాడి జరిగిన సంఘటనను మరువకముందే కర్నూలు జిల్లాలో ఈనాడు దినపత్రిక కార్యాలయంలో మరొక అనూహ్య సంఘటన వెలుగులోకి రావడం ప్రజాస్వామ్య వ్యవస్థకే అవమానకరం కారణాలు ఏమి అయిన అందులో వృత్తి ధర్మం పాటించే ఉద్యోగులు,పత్రికావిలేకరులు, పత్రికా యాజమాన్యాలపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసం ఇలాంటి సంఘటనలు జరుగకుండా ప్రజాస్వామ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని పూర్వ సివిల్స్ విద్యార్థి నాయకులు, జర్నలిస్టు మరియు బిజెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జున పేర్కొన్నారు అలాగే సమాజంలో మానసిక ప్రశాంతత కొనసాగాలంటే చదువుకున్న యువతతో పాటు, సోషల్ మీడియా వేదికగా పలు సామాజిక న్యాయం సేవ కోసం కృషి చేసే మేధావి వర్గాలు అన్ని ఒక్క తాటిపైకి వచ్చి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరుగకుండా ఉండాలి అంటే ఇలాంటి సంఘటనలు జరిగేలా ప్రోత్సహించే వాళ్లపై మరియు దాడులు చేసే వారిపై కేసులు నమోదు చేస్తూ చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా జర్నలిస్టులకు రక్షణ కల్పించే విధంగా అన్ని రకాల చట్టాలను పటిష్టంగా అమలు చేయడంతో పాటు, రాజకీయాలకు అతీతంగా పని చేస్తూ నిజానిజాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, పత్రికా విలేకరులు, పత్రికా యాజమాన్యాలపై, సంస్థలపై ఇలాంటి సంఘటనలు జరుగకుండా ప్రజాస్వామ్య పరిరక్షణకు కోసం అధికార్లతో పాటు,సమాజంలో బాధ్యత గల పౌరులు,యువకులు, ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని కోరారు.
![]() |
బిజెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జున |