ఆగి ఉన్న బస్సును ఢీకొన్న కారు ఇద్దరు దుర్మరణం...
ఆగి ఉన్న బస్సును ఢీకొన్న కారు ఇద్దరు దుర్మరణం...
మృతుల్లో ఒకరు బస్సు డ్రైవర్, మరొకరు కారు ఓనర్
బూదనం టోల్ ప్లాజా వద్ద ఘటన
చిల్లకూరు/తిరుపతి, మార్చి 14 (పీపుల్స్ మోటివేషన్):-
చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా వద్ద గురువారం తెల్లవారున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గిద్దలూరు నుండి చెన్నైకి వెళుతున్న ఆర్టీసీ బస్సు ముందుచక్రం పంచరైంది. బస్సును పక్కకు పార్క్ చేసి బస్సులోని రెండవ డ్రైవర్ మలంగ్షా వలి (52) వెనుక టైరు కింద రాళ్లు పెడుతుండగా తాడేపల్లి గూడెం నుండి చెన్నై ఆస్పత్రికి వెళుతున్న కారు బస్సును ఢీకొంది. దీంతో బస్సు డ్రైవర్ మలన్షా వలి, కారులో ఉన్న వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. కారులో ఉన్న మృతుని భార్య, కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. చిల్లకూరు ఎస్ఐ అంజిరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.