గిరిజన సంక్షేమ హాస్టల్ లో విద్యార్థుల గోడు పట్టని వార్డెన్, ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి
గిరిజన సంక్షేమ హాస్టల్ లో విద్యార్థుల గోడు పట్టని వార్డెన్, ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి
- నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ టీమ్
ఆలూరు, మార్చి 18 (పీపుల్స్ మోటివేషన్):-
గిరిజన సంక్షేమ హాస్టల్ లో విద్యార్థుల సమస్యలు వార్డెన్ రాజశేఖర్, ప్రిన్సిపాల్ జమ్మన్న దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవడంలేదని విద్యార్థులు వాపోతున్నారు.
హాస్టల్ విద్యార్థులతో మాట్లాడుతున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జనరల్ సెక్రెటరీ బెస్త గోవిందరాజులు |
ఆలూరు పట్టణం హత్తీబెలగల్ రోడ్ లో గల గిరిజన సంక్షేమ హాస్టల్ ను కర్నూలు జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ టీమ్ సభ్యులు సందర్శించారు. విద్యార్థుల సమస్యల గురించి ఆరా తీయగా విద్యార్థులు వారితో మాట్లాడుతూ.. మెనూ పాటించడం లేదని నీళ్ళచారు, ఏదో రకం కాయగూరల కర్రీ అందులో ఉప్పు కారం ఉండదని, నాణ్యమైన భోజనం అందించటం లేదని సుమారుగా 40 మంది విద్యార్థులు వాళ్ళ సమస్యలను తెలియజేశారు.
అలాగే రాత్రీ వేళ నైట్ డ్యూటీ చేసే వాచ్మెన్ మద్యం తాగి వచ్చి పిల్లను కొట్టడం, పిల్లల దగ్గర గలీజ్ పనులు చేస్తూ పిల్లలు పడుకుంటే వాళ్ల నిక్కర్స్, ప్యాంట్స్ లాగటం చెవులలో పుల్లలు పెట్టడం భయపెట్టడం చేస్తాడని మీ తల్లి తండ్రులకు గతి లేక ఇక్కడ విడిచిపెట్టారని పిల్లలను ప్రతిసారీ తిడతారని వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు వాచ్మెన్ మీద చర్యలు తీసుకోవాలని అలాగే ప్రభుత్వం విద్యార్ధులకు రుచికరమైన నాణ్యమైన భోజనం అందించాలని చర్యలు చేపట్టినప్పటికీ ఇలాంటి అధికారులు విద్యార్థులకు మంచి భోజనం పెట్టకపోవడం విద్యార్థుల సమస్యల గురించి ఆరా తీయకపోవడం గమనార్హం. ఈ విషయం గురించి పై స్థాయి అధికారులకు తెలియజేస్తామని వాచ్మెన్ కు ఏ హక్కు ఉందని పిల్లలను అలా అనడానికి అని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు మాట్లాడారు. ఇంతకన్నా ఘోరం ఏ హాస్టల్ లో లేదని తక్షణమే వాచ్మెన్ పై, పిల్లల సంరక్షణ సరిగ్గా చూసుకొని హాస్టల్ వార్డెన్ రాజశేఖర్ మరియు ప్రిన్సిపాల్ జమ్మన్న పై చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ బెస్త గోవింద రాజులు,సౌత్ ఇండియన్ లీగల్ సెక్రెటరీ శరణప్ప, డివిజన్ సెక్రటరీ వీరభద్రప్ప డిమాండ్ చేశారు.