ప్రజల కష్టాలు పట్టవా బుగ్గనా -కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి
ప్రజల కష్టాలు పట్టవా బుగ్గనా -కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి
డోన్, మార్చి 18 (పీపుల్స్ మోటివేషన్):-
నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం లోని తమ సొంత మండలం బేతంచెర్ల మాత్రమే కరువు మండలంగా ప్రకటించారని డోన్, ప్యాపిలి మండలాల లోని కరువు కనిపించలేదా, రైతులను ఆదుకోవాలని అనిపించలేదా అంత స్వార్థం అవసరమా అంటూ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి మంత్రి బుగ్గనకు ప్రశ్నించారు. ముస్లిం పెద్దలు మాట్లాడుతూ నిన్న బుగ్గన సమక్షంలో చేరిన ముస్లిం నాయకులు వక్స్ బోర్డ్ కు 40 లక్షల వరకు ఫ్రాడ్ చేశారు. ఆ విషయం కోర్టులో ఉంది. గుంటూరు ముస్లిం మైనారిటీ జె ఏ సి వారు కూడా ఖండించారు. ప్రతి మసీదులోని మసీదు కమిటీలతో చర్చించక వారి స్వార్థం కోసం కమిటీలను ఏర్పాటుచేసి ఇఫ్తార్ విందుకు రమ్మని వచ్చిన వారిని బలవంతంగా చేరినట్లు ప్రకటించటం తప్పని ముస్లిం సోదరులను ఏకీభవించక ఖండిస్తున్నామని ముస్లిమ్ సోదరులు తెలిపారు.