ముగ్గురు బాలికల అదృశ్యం... ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు
ముగ్గురు బాలికల అదృశ్యం... ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు
ఏలూరు/ఆగిరిపల్లి, (పీపుల్స్ మోటివేషన్):-
ఏలూరు జిల్లాలో ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. ప్రతిరోజు లాగే ఉదయం పాఠశాలకని వెళ్లినవారు.. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన తో పోలీసులను ఆశ్రయించారు. ఆగిరిపల్లి మండలంలోని ఓ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వీరు 9వ తరగతి చదువుతున్నారు. పాఠశాల సమయం ముగిసినా తిరిగి ఇంటికి రాకపోవడంతో చుట్టు పక్కల పరిసరాల్లో తల్లిదండ్రులు వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో బాలికలు పాఠశాలకు వెళ్లకుండా ఆర్టీసీ బస్సులో వీరవల్లి వెళ్లినట్లు గుర్తించారు. ఆ ముగ్గురిలో ఓ బాలిక చరవాణి వాడుతోంది. సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు ట్రేస్ చేయగా ప్రకాశం జిల్లాలో గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.