అవుకులో దారుణ హత్య...అనుమానం పెనుభూతం
అవుకులో దారుణ హత్య...
- భార్య, అత్తపై దాడి..
- అనుమానం పెనుభూతం.. కుటుంబ కలహాలే కారణం
నంద్యాల/ అవుకు, మార్చి 04 (పీపుల్స్ మోటివేషన్):-
అవుకు బస్టాండ్ లో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే భార్య, అత్తపై ఓ వ్యక్తి కత్తితో కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన చూస్తున్న జనం భయబ్రాంతులకు గురయ్యారు. భార్యపై అనుమానంతో పోల్కా రంగస్వామి అనే వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనుమానం అనే పెనుభూతం వల్లే అతడు కత్తితో నరికినట్లు తెలిసింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అవుకు కోట వీధిలో కుమారి (30), భర్త రంగస్వామి నివాసముంటున్నారు. వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. అనుమానం కుటుంబ సమస్యలతో తరచూ ఇద్దరి మధ్య ఘర్షణ నెలకొంటోంది. ఆ కారణంగా ఆమె వారి పుట్టింటికి వెళ్లి వాళ్ల అమ్మ సుబ్బలక్ష్మమ్మ తో చెప్పి మాట్లాడటానికి అవుకు వచ్చింది. ఈ క్రమంలోనే అవుకు బస్టాండ్ లో టెంకాయల షాప్ లో ఉండే కత్తితో ఈ దారుణానికి ఒడిగట్టాడు. భార్య కుమారి(30) మృతి చెందింది. అత్త సుబ్బలక్ష్మమ్మ (50 )కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం స్థానిక వైద్యశాలకు తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. నిందితుడు రంగస్వామిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు సుబ్బలక్ష్మమ్మ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని ఇంచార్జ్ ఎస్ఐ తిరుపాల్ తెలిపారు.