MNP#మొబైల్ నంబర్ పోర్టబిలిటీ జులై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి.. ట్రాయ్ మార్గదర్శకాలు
MNP#మొబైల్ నంబర్ పోర్టబిలిటీ జులై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి.. ట్రాయ్ మార్గదర్శకాలు
7 రోజుల్లోనే మొబైల్ నంబర్ పోర్టబిలిటీ పూర్తి కాకుండా చెక్
సిమ్ మోసాలను అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కొత్త నిబంధనలు
నూతన మార్గదర్శకాలు జులై 1 నుంచి అమల్లోకి
డిల్లీ, (పీపుల్స్ మోటివేషన్):-
మొబైల్ నంబర్ మార్చకుండా వేరే నంబర్కు మారేందుకు వెసులుబాటు కల్పిస్తున్న మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP) విషయంలో ట్రాయ్ కొత్త నిబంధన తీసుకొచ్చింది. సిమ్ కార్డ్ స్వాప్ లేదా రీప్లేస్ చేసిన ఏడు రోజుల వరకు వేరే నెట్వర్కు మారడాన్ని నిలిపివేసింది. సిమ్ స్వాప్ మోసాలను అరికట్టేందుకు గానూ ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
సిమ్ పేరుతో జరిగే మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వీటికి చెక్ పెట్టాలంటూ టెలికాం విభాగం రాసింది. దీంతో ట్రాయ్ కొత్త మార్పు చేపట్టింది. ఈ కొత్త నిబంధనతో కూడిన సర్క్యులర్ ను గత వారం జారీ చేసింది. దీని ప్రకారం.. ఎవరైనా వ్యక్తి సిమ్ కార్డు మార్చుకున్నా, స్వాప్ చేసినా వారం రోజుల వరకు వేరే నెట్వర్కు మారేందుకు అవసరం అయ్యే యునిక్ పోర్టింగ్ కోడ్ను (UPC) జారీ చేయరు. కొత్త వ్యక్తి పేరుతో అదే నెంబర్ ను తీసుకోకుండా కేటుగాళ్లను నిలువరించే ఉద్దేశంతో ఈ నిబంధన తీసుకొచ్చినట్లు ట్రాయ్ తెలిపింది.