ఈ సారి కొండారెడ్డి బురుజు పై టిడిపి జెండా ఎగరవేస్తాం... బస్తిపాటి నాగరాజు
ఈ సారి కొండారెడ్డి బురుజు పై టిడిపి జెండా ఎగరవేస్తాం... బస్తిపాటి నాగరాజు
కర్నూలు అసెంబ్లీ టిడిపి అభ్యర్థి టీ.జి భరత్ నామినేషన్
కార్యక్రమంలో పాల్గొన్న కర్నూలు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి బస్తిపాటి నాగరాజు
కర్నూలు, ఏప్రిల్ 25 (పీపుల్స్ మోటివేషన్):-
కర్నూలు కొండారెడ్డి బురుజు పై ఈ సారి తెలుగు దేశంపార్టీ జెండా ఎగరవేస్తామని కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు.. కర్నూలు అసెంబ్లీ టిడిపి అభ్యర్థి టీ.జీ భరత్ నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.. ఈ సంధర్బంగా నాగరాజు మాట్లాడుతూ జగన్ రాష్ట్రాన్ని పాలించడంలో విఫలం చెందాడని, వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో 20 సంవత్సరాల వెనక్కి వెళ్లిందని ఆరోపించారు.. నవరత్నాలు, పథకాల పేరుతో జగన్ 13 లక్షల కోట్లు అప్పు చేసి, ఒక్కొక్కరి పై 2 లక్షల అప్పు మోపాడన్నారు.. జగన్ అరాచక పాలనలో అన్ని వర్గాల వారు నష్టపోయారని, రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు.. వైసీపీ ఐదేళ్ల విధ్వంస పాలనను చూశామని.. మరో సారి ఆ పార్టీకి అవకాశం ఇస్తే మన జీవితాలను మనమే నాశనం చేసుకుంటామన్నారు.. ఇక రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి ఎంపీ గా తనను, ఎమ్మెల్యే గా టీ.జి భరత్ ను గెలిపిస్తే ఇద్దరం కలిసి కర్నూలును అభివృద్ధి చేస్తామని నాగరాజు తెలిపారు..అంతకు ముందు పెద్ద మార్కెట్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో టిడిపి, బిజెపి, జనసేన, ఎం.ఆర్.పి.ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..