24 నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు.. హాల్ టికెట్లను విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు..
24 నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు.. హాల్ టికెట్లను విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు..
అమరావతి (పీపుల్స్ మోటివేషన్):-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించనున్న పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 1,61,877 మంది హాజరుకానున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు ఉంటాయన్నారు. విద్యార్థులను ఉదయం 8.45 నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని వెల్లడించారు. హాల్ టికెట్లను విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా వెబ్సైట్లో ఉంచామని తెలిపారు. మే 24, 25, 27 తేదీల్లో మొదటి, ద్వితీయ, తృతీయ భాషా సబ్జెక్టులు, 28, 29, 30, 31 తేదీల్లో గణితం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, సాంఘికశాస్త్రం పరీక్షలు ఉంటాయని.. జూన్ 1, 3 తేదీల్లో ఓఎస్ఎస్ పేపర్-1, 2 నిర్వహిస్తున్నామని వివరించారు.
ఇక్కడ క్లిక్ చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోండి