రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

త్రాగు నీటికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టండి...

Kurnool District news Water crisis In Kurnool Breaking News in India Today Today live News today Today News in Telugu Top 10 News Ap Political News
Peoples Motivation

త్రాగు నీటికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టండి...

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి...

కర్నూలు, మే 21 (పీపుల్స్ మోటివేషన్):- 

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించి ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని , నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని , ఓట్ల లెక్కింపు ముందు తర్వాత శాంతి భద్రతలు కాపాడటానికి చర్యలు చేపట్టాలని ఆదేశించినారు.

Ap State chief secretary jawahar reddy

మంగళవారం సాయంకాలం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించి రాష్ట్రంలో విద్యుత్ సరఫరా విధానం గురించి తెలుసుకొని పోలింగ్ రోజున కొన్ని ప్రదేశాలలో విద్యుత్ అంతరాయానికి తీసుకున్న చర్యలు గురించి వాకబు చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము లో అనుమతులు పొంది ఉన్న పనుల అమలు కు సంబంధించి పూడికతీత పనులు , వ్యవసాయ సంబంధిత పనులు , నీటి సరఫరా సంబంధిత మరమ్మత్తు పనులు , పంట పొలాల అభివృద్ధి పనులు చేసుకోవాలని సూచించారు. 

రాష్ట్రంలో త్రాగునీటి సరఫరా కొరకు ఇచ్చిన అనుమతుల ప్రకారం ప్రజలకు ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా చేయాలని ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. చీఫ్ సెక్రటరీ కర్నూలు గురించి అడుగగా ...ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .సృజన స్పందిస్తూ... జిల్లాలో అనుమతులు మేరకు ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా చేస్తామని తెలియజేశారు. కర్నూలులో పట్టణం లో ఇంతకు మునుపు రోజు విడిచి రోజు ఇచ్చేవారమని ఇప్పుడు కొన్ని వార్డులు మినహాయించి మిగతా వాటికి ప్రతిరోజు నీటి సరఫరా చేస్తున్నామని కర్నూలు పట్టణానికి 60 రోజులకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని తెలియజేశారు. ఈమధ్య వర్షాలు పడటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో సమస్య తక్కువగా ఉందని అయినప్పటికీ త్రాగునీటి సరఫరా మెరుగుపరిచే చర్యలు తీసుకుంటున్నామని , అలాగే ఎమ్మిగనూరు లో 15 రోజులు తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని దాన్ని ఇప్పటినుంచే అధిగమించడానికి అవసరం మేరకు ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా చేస్తామని చేస్తామని చీఫ్ సెక్రటరీ కి తెలియజేశారు. 

Kurnool District collector Dr G Srujana

కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి డి.ఆర్.ఓ మధుసూదన్ రావు , జిల్లా పరిషత్ సీ.ఈ.వో నాసర రెడ్డి ఏపీఎస్పీడీసీఎల్ ఎస్సీ ఉమాపతి , ఇరిగేషన్ ఎస్సీ రెడ్డి శేఖర్ రెడ్డి , ఆర్డబ్ల్యూఎస్ ఎస్సి నాగేశ్వర రావు , గనుల శాఖ డిడి రాజశేఖర్ మొదలగు అధికారులు పాల్గొన్నారు..

Comments

-Advertisement-