రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు..

Bangalore rave party celebrity list Rave party meaning Bangalore rave party pics Tollywood news Telugu cinema News Telugu mirchi news Telugu movies
Peoples Motivation

ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు : బెంగళూరు పోలీస్ కమిషనర్

బెంగళూరులో రేవ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు

ఆ రేవ్ పార్టీకి 'సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ అనే పేరు..

రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు..

తాను ఆ పార్టీలో పాల్గొనలేదంటూ నిన్న బుకాయించిన హేమ

సొంత ఫాంహౌస్ లో ఉన్నానని నమ్మించే ప్రయత్నం!

హేమ కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్టు వెల్లడించిన బెంగళూరు సీపీ దయానంద్

Bangalore rave party celebrity list Rave party meaning Bangalore rave party pics Tollywood news Telugu cinema News Telugu mirchi news Telugu movies

ఈ రేవ్ పార్టీకి 'సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ' అని పేరుపెట్టారని తెలిపారు. ఈ పార్టీలో వంద మంది పాల్గొన్నారని, వారిలో సినీ నటి హేమ కూడా ఉన్నారని స్పష్టం చేశారు. అయితే, తాను ఈ పార్టీలో పాల్గొనలేదని, సొంత ఫాంహౌస్ లోనే ఉన్నానంటూ హేమ విడుదల చేసిన వీడియో ఎక్కడ రికార్డ్ చేశారన్నదానిపై విచారణ జరుపుతున్నామని సీపీ వివరించారు. 

బెంగళూరులో పోలీసులు ఓ రేవ్ పార్టీని భగ్నం చేయడం తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలను బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ మీడియాకు తెలియజేశారు. ఈ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు అని వెల్లడించారు. 

ఈ పార్టీలో పాల్గొన్నవారిలో ఐదుగురిని అరెస్ట్ చేశామని, ఇందులో ప్రజాప్రతినిధులు ఎవరూ పాల్గొనలేదని వెల్లడించారు. బెంగళూరు నగర శివారు ప్రాంతంలోని ఓ ఫాంహౌస్ లో నిర్వహించిన ఈ రేవ్ పార్టీలో అత్యధికంగా తెలుగు బుల్లితెర నటులు, మోడళ్లు పాల్గొన్నట్టు గుర్తించారు. ఈ రేవ్ పార్టీని ఓ వ్యాపారవేత్త ఏర్పాటు చేశారు.

Comments

-Advertisement-