సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు ప్రయాణం వాయిదా వేసుకోండి..
సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు ప్రయాణం వాయిదా వేసుకోండి..
చలమ రేంజిలో చిరుత పులులు ఎలుగు బంటిల సంచారం..
-రేంజ్ అధికారి ఈశ్వరయ్య
నంద్యాల/రుద్రవరం, మే 10 (పీపుల్స్ మోటివేషన్):-
చలమ రేంజి లో ఉన్న నంద్యాల, గిద్దలూరు ప్రధాన రహదారిలో ఉన్న అభయారణ్యంలో సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు ప్రయాణం వాయిదా వేసుకోవాలని చలమరేంజ్ అధికారి ఈశ్వరయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ నాగర్జున శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ లో పెద్ద పులుల అభయరన్యం నంద్యాల గిద్దలూరు రహదారిలో అంకిరెడ్డి చెరువు నుండి ప్రకాశం జిల్లా సరిహద్దు వరకు చలమ రేంజ్ పరిధిలో చిరుతపులులు మరియు ఎలుగుబంటి ల సంచారం ఎక్కువగా ఉందన్నారు. ఎక్కువగా ద్విచక్ర వాహనదారులపై చిరుత పులులు, ఎలుగుబంటి లు దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. కావున ఈ రహదారిలో ప్రయాణం చేసే వాహనదారులు సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సిందిగా కోరారు.