రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

క‌ష్ట‌మొస్తే అండ‌గా నిల‌బ‌డే టి.జి భ‌ర‌త్‌ను గెలిపించండి..

TG BHARATH MLA Tg BHARATH latest news TG br siraj ur rehman real name br siraj ur rehman wikipedia br siraj ur rehman biography br siraj ur rehman age
Peoples Motivation

క‌ష్ట‌మొస్తే అండ‌గా నిల‌బ‌డే టి.జి భ‌ర‌త్‌ను గెలిపించండి..

ఓ ముస్లిం సోద‌రా నీ గ‌మ్యం ఎటు పేరుతో కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ వ్యాఖ్యాత‌ బి.ఆర్ సిరాజ్

వేలాదిగా హాజ‌రైన ముస్లింలు

TG BHARATH MLA Tg BHARATH latest news TG br siraj ur rehman real name br siraj ur rehman wikipedia br siraj ur rehman biography br siraj ur rehman age
కర్నూలు, మే 10 (పీపుల్స్ మోటివేషన్):-

భార‌త‌దేశ‌మంటే భిన్న‌త్వంలో ఏక‌త్వ‌మ‌ని ప్ర‌ముఖ వ్యాఖ్యాత బి.ఆర్ సిరాజ్ అన్నారు. కులం, మ‌తం చూసి ఓటు వేయ‌డం మూర్ఖ‌త్వ‌మ‌ని ఆయ‌న ముస్లిం సోద‌రుల‌తో చెప్పారు. గురువారం రాత్రి క‌ర్నూలు న‌గ‌రం పాత‌బ‌స్తిలోని జ‌మ్మిచెట్టు వ‌ద్ద ఓ ముస్లిం సోద‌రా నీ గ‌మ్యం ఎటు అనే కార్య‌క్ర‌మంలో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్, క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థి టి.జి భ‌ర‌త్‌ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సిరాజ్ మాట్లాడుతూ క‌ర్నూలు ప్ర‌జ‌ల‌కు క‌ష్టాలు వ‌స్తే నేనున్నానంటూ ఆదుకునే మంచి వ్య‌క్తిత్వం ఉన్న వ్య‌క్తి టి.జి భ‌ర‌త్ అన్నారు. క‌ష్టాల్లో తోడుగా ఉండి మంచి స‌మాజాన్ని నిర్మించే స‌రైన వ్య‌క్తిని ప్ర‌జ‌లు ఎన్నుకోవాల‌న్నారు. బీజేపీ సాకు చూపుతూ టి.జి భ‌ర‌త్‌కు ఓటు వేయొద్దంటూ వైసీపీ నేత‌లు ప్ర‌చారం చేయ‌డం త‌ప్ప‌న్నారు. తాను ఇప్ప‌టిదాకా ఎంతో మంది వైసీపీ అభ్య‌ర్థుల త‌రుపున స‌భ‌ల్లో పాల్గొన్న‌ట్లు చెప్పారు. అయితే మొట్ట‌మొద‌టిసారి టిడిపి అభ్య‌ర్థి టి.జి భ‌ర‌త్ త‌రుపున మాట్లాడేందుకు వ‌చ్చిన‌ట్లు చెప్పారు. త‌న‌ను ఈ కార్య‌క్ర‌మానికి రావొద్దంటూ ఎంతో మంది బెదిరింపు ఫోన్ కాల్స్‌, మెసేజ్‌లు పెట్టార‌న్నారు. తాను ఎంచుకున్న వ్య‌క్తి స‌రైన వ్య‌క్తి కావ‌డంతోనే ధైర్యంగా అడుగేసి క‌ర్నూలుకు వ‌చ్చిన‌ట్లు సిరాజ్ పేర్కొన్నారు. టి.జి కుటుంబం ఎప్పుడూ ముస్లింల‌ను శ‌త్రువులుగా భావించ‌లేద‌న్నారు. ఒక్క ముస్లిం కుటుంబానికి కూడా కీడు త‌ల‌పెట్ట‌లేద‌న్నారు. ఎమ్మెల్యేగా టిజి భ‌ర‌త్ గెలిచిన త‌ర్వాత ముస్లింల‌కు అన్యాయం జ‌రిగితే నేరుగా త‌న‌కు ఫోన్ చేయండని ఆయ‌న ముస్లింల‌కు చెప్పారు. మంచి చేసేందుకు రాజ‌కీయాల్లో ఉన్న టి.జి భ‌ర‌త్‌ను గెలిపించాల‌ని ఆయ‌న ముస్లిం సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌ను కోరారు. అనంత‌రం మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ మాట్లాడుతూ ముస్లింల రిజ‌ర్వేష‌న్ల‌పై వైసీపీ నేత‌లు త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తున్నార‌న్నారు. ప్ర‌జ‌లు వీటిని న‌మ్మొద్ద‌ని ఆయ‌న కోరారు. తెలుగుదేశం పార్టీని గెలిపించాలన్నారు. అనంత‌రం టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ ఐదేళ్ల జీవితం బాగుండాలంటే త‌న‌లాంటి స‌రైన వ్య‌క్తి ఎమ్మెల్యేగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌జ‌లంద‌రూ త‌న‌కు ఎమ్మెల్యేగా ఒక్క అవ‌కాశం ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు. కార్య‌క్ర‌మంలో టిడిపి సీనియ‌ర్ నాయ‌కులు, బూత్ ఇంచార్జీలు, భారీగా ప్ర‌జ‌లు పాల్గొన్నారు.

TG BHARATH MLA Tg BHARATH latest news TG br siraj ur rehman real name br siraj ur rehman wikipedia br siraj ur rehman biography br siraj ur rehman age

Comments

-Advertisement-