రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

వాహనం బోల్తా.. బయటపడ్డ రూ. 7 కోట్ల డబ్బు సీజ్

latest news telugu, breaking news in india, today latest news in telugu, latest news today, latest news live Vehicle accident 7cr rs seized East godav
Peoples Motivation

వాహనం బోల్తా.. బయటపడ్డ రూ. 7 కోట్ల డబ్బు సీజ్

తూర్పు గోదావరి జిల్లాలో ఘటన

తౌడు బస్తాల మధ్య బాక్సుల్లో డబ్బు దాచిన వైనం

గాయపడ్డ డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. డబ్బు సీజ్

latest news telugu, breaking news in india, today latest news in telugu, latest news today, latest news live Vehicle accident 7cr rs seized East godav
తూర్పుగోదావరి (పీపుల్స్ మోటివేషన్):-

ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తరలుతున్న ఎన్నికల డబ్బు పోలీసుల తనిఖీల్లో భారీగా పట్టుబడుతోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఈ తరహా ఘటన చోటుచేసుకుంది.

జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లి ఎర్రకాలువ దగ్గర ఓ లారీ వెళ్లి టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ వాహనం బోల్తాపడింది. విశాఖ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద వార్త తెలియగానే ఘటనా స్థలానికి కానిస్టేబుల్ ఎస్. రవికుమార్ చేరుకున్నాడు. వాహనంలో తౌడు బస్తాల మధ్య మొత్తం 7 బాక్సుల్లో నగదును దాచి తరలిస్తున్నట్లు గుర్తించాడు. వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాడు. హుటాహుటిన ఘటనాస్థలికి వచ్చిన అధికారులు నగదును వీరవల్లి టోల్ ప్లాజాకు తరలించి లెక్కించగా దాదాపు రూ. 7 కోట్లుగా తేలింది. వాహన డ్రైవర్ కు గాయాలు కావడంతో అతన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

-Advertisement-