ఇంటర్ అర్హతతో ఉన్నత చదువుతో పాటు ఉద్యోగం
ఇంటర్ అర్హతతో ఉన్నత చదువుతో పాటు ఉద్యోగం
నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ
మొత్తం 404 ఖాళీల భర్తీకి తాజాగా ప్రకటన
ఇంటర్ పాస్ అయిన వారికి త్రివిధ దళాల్లో చేరే అవకాశం
ఇంటర్మీడియట్ అర్హతతో త్రివిధ దళాల్లోకి చేయాలనుకునే వారికి సువర్ణ అవకాశాన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కల్పిస్తోంది. ఉన్నత విద్యాభ్యాసంతో పాటు మంచి హోదాతో నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ లో చేరేందుకు వీలు కల్పించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) అండ్ నేవీ అకాడమీ (ఎన్ఏ) పరీక్షకు సంబంధించి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 404 ఖాళీల భర్తీకి ఇంటర్ పూర్తిచేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. సెలక్ట్ అయిన అభ్యర్థులకు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం కల్పించి, చదువు పూర్తయ్యాక వివిధ హోదాల్లో ఉద్యోగంలోకి తీసుకుంటుంది. దేశానికి సేవ చేసే అవకాశంతో పాటు మంచి ఉద్యోగం సాధించేందుకు తోడ్పడే ఈ పరీక్ష వివరాలు..
ఖాళీలు
మొత్తం 404. ఎన్ డీఏలో 370 (ఆర్మీ-208, నేవీ-42, ఏయిర్ ఫోర్స్- 120)
ఎన్ఏలో 34 (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్)
అర్హత
ఆర్మీ వింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి ఇంటర్ పాస్ (అన్ని గ్రూపులు), ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ పాస్
వయో పరిమితి
అభ్యర్థుల వయసు కనిష్ఠంగా 16.5 ఏళ్ల నుంచి గరిష్ఠంగా 19.5 ఏళ్లు
ఎంపిక
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్
దరఖాస్తులు
జూన్ 4 లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 1న రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు 2 జులై 2025 నుంచి క్లాసులు ప్రారంభం అవుతాయి.
పూర్తి వివరాల కోసం వెబ్సైట్ చూడగలరు: www.upsc.gov.in