ప్రైవేట్ కాలేజీల్లో ఇంటర్ ఉచిత ప్రవేశాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
ప్రైవేట్ కాలేజీల్లో ఇంటర్ ఉచిత ప్రవేశాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
హైదరాబాద్, మే 18 (పీపుల్స్ మోటివేషన్):-
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ విద్యార్థులు వివిధ ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో చేరేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎస్సీ సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మే 30లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ప్రకటన వివరాలు..
ప్రైవేట్ కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ఉచిత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.
అర్హతలు: పదో తరగతిలో కనీసం 7జీపీఏ, ఆ పైగా ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, నవోదయ, ఎయిడెడ్, జెడ్పీ, ఆదర్శ, కస్తూర్బా స్కూళ్లలో చదివిన విద్యార్థులు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులు ప్రవేశం పొందే అవకాశం ఉంది. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులకు రూ. లక్ష, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు 5.2 లక్షలకు మించకూడదు.
ఎంపిక విధానం: ఆన్లైన్ ఆటోమెటిక్ సిస్టమ్ ద్వారా
విద్యార్థులను ఎంపిక చేస్తారు. అనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.
అప్లికేషన్ కు చివరి తేది: మే 30
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి..
మరింత సమాచారం కోసం కింది లింక్ పై క్లిక్ చేయండి
ఆన్లైన్ దరఖాస్తు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి