నేడే గ్రూప్-1 ప్రిలిమ్స్ కీ విడుదల..
TSPSC GROUP 1 KEY
TSPSC GROUP 1 RESULTS
TSPSC GROUP 1 HALL TICKETS
TSPSC FORGOT ID
APPSC GROUP 2
APPSC GROUP 1
DEO
AP DSC
AP TET
TS DSC
TS TET
GROUP 2
By
Janu
నేడే గ్రూప్-1 ప్రిలిమ్స్ కీ
ఈరోజు గ్రూప్ – 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రిలిమినరీ కీ ని వెబ్‌సైట్‌లో పెట్టనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.
ఈ నెల 9వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాథమిక కీతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్ కూడా అందుబాటులో ఉంటుందన్నారు. అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా లాగిన్ అయి.. కీని సరిచూసుకోవాలని సూచించింది టీజీపీఎస్సీ. ప్రాథమిక కీపై అభ్యంతరాలను 13వ తేదీ నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు టీజీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఈమెయిల్ ద్వారా వచ్చే అభ్యంతరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని టీజీపీఎస్సీ అధికారులు స్పష్టం చేశారు.మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఇలా..
గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విడుదల చేసింది. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్లు షెడ్యూల్‌ను విడుదల చేసింది టీజీపీఎస్సీ. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మీడియంలలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి పేపర్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ నెల 9వ తేదీన గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఫలితాలను విడుదల చేయనున్నారు.
సబ్జెక్టుల వారీగా..
అక్టోబర్ 21 – జనరల్ ఇంగ్లీష్(క్వాలిఫయింగ్ టెస్ట్), అక్టోబర్ 22 – పేపర్ 1(జనరల్ ఎస్సే), అక్టోబర్ 23 – పేపర్ 2(హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ), అక్టోబర్ 24 – పేపర్ 2 (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం అండ్ గవర్నెన్స్), అక్టోబర్ 25 – పేపర్ 4(ఎకానమి అండ్ డెవలప్‌మెంట్), అక్టోబర్ 26 – పేపర్ 5(సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్‌ప్రిటేషన్), అక్టోబర్ 27 – పేపర్ 6(తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్) నిర్వహించనున్నట్లు షెడ్యూల్ లో పేర్కొన్నారు.
Comments