AP DSc: మెగా డీఎస్సీపై తొలి సంతకం అప్పుడే..
AP DSc: మెగా డీఎస్సీపై తొలి సంతకం అప్పుడే..
అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు (Chandra Babu) గురువారం బాధ్యతలు(Charge) చేపట్టనున్నారు. విజయవాడ సెక్రటేరియట్‌లోని మొదటి బ్లాక్ ఛాంబర్‌లో సాయంత్రం 4.41 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ (Mega DSC ) పై తొలి సంతకం చేయనున్నారు. రెండో సంతకం ల్యాండ్ అండ్ టైటిలింగ్ యాక్ట్(Land Title Act) రద్దుపై, మూడో సంతకం పెన్షన్లు(Pensions) రూ. 4 వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై ఆయన ముఖ్యమంత్రి హోదాలో సంతకం చేయనున్నారు.
రాష్ట్ర విభజన అనంతరం రెండో సారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇవాళ విజయవాడలోని కేసరపల్లిలో ఏర్పాటుచేసిన వేదిక పై ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో పాటు పవన్‌కల్యాణ్, మరో 23 మంది కూటమి సభ్యులతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, చిరాగ్ పాశ్వాన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ, ప్రముఖ నటులు చిరంజీవి, రజినీకాంత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, తదితరులు పాల్గొన్నారు.