-Advertisement-

Accident: గ్లాస్ పరిశ్రమలో భారీ పేలుడు.. ఆరుగురు దుర్మరణం..!

Daily telugu Daily trending news Breaking news telugu Telugu news Telugu stories Crime News Politics news Current Affairs pdf Today Latest headlines
Pavani

Accident: గ్లాస్ పరిశ్రమలో భారీ పేలుడు.. ఆరుగురు దుర్మరణం..!

షాద్నగర్: రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్లో పెను విషాదం చోటు చేసుకుంది. స్థానిక సౌత్ గ్లాసు పరిశ్రమలో కంప్రెషర్ పేలడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ పేలుడుతో పరిశ్రమ వద్ద భీతావహ వాతావరణం నెలకొంది. గాజు పరిశ్రమ కావడంతో కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ఈ ఘటనలో 15మందికి గాయాలు కాగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

Daily telugu Daily trending news Breaking news telugu Telugu news Telugu stories Crime News Politics news Current Affairs pdf Today Latest headlines
ఒకేసారి కంప్రెషర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఈ దుర్ఘటన ఎలా జరిగిందనే దానిపై ఇంకా ఆరా తీస్తున్నారు. మృతులు ఒడిశా, బిహార్, యూపీ వాసులుగా గుర్తించారు. తీవ్ర గాయాలైనవారిని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా, గాంధీ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కార్మికసంఘం నేతలు చెబుతున్నారు. గతంలో ఇక్కడ ఇలాంటి ఘటన జరిగినప్పుడే కార్మికుల భద్రత దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని ఇచ్చిన సూచనల్ని ఏ మేరకు పాటించారనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సౌత్ గ్లాస్ పరిశ్రమను శంషాబాద్ డీసీపీ రాజేశ్ పరిశీలించారు.

క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశం

షాద్నగర్లో జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారుల్ని అప్రమత్తం చేసిన ఆయన.. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్ను ఆదేశించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు.

• ఈ దుర్ఘటనపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Comments

-Advertisement-