-Advertisement-

TG Govt: రుణమాఫీకి త్వరలో మార్గదర్శకాలు..!

Daily telugu Daily trending news Breaking news telugu Telugu news Telugu stories Crime News Politics news Current Affairs pdf Today Latest headlines
Pavani

రుణమాఫీకి త్వరలో మార్గదర్శకాలు..!

రుణమాఫీకి నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఇందుకు రేషన్ కార్డు ప్రామాణికం కాదని స్పష్టం చేశారు. రూ.2లక్షల వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “రైతు రుణమాఫీ తర్వాత రైతుబంధు ఇతర పథకాలపై దృష్టి పెడతాం. కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన రెండు రోజుల తర్వాత తెలంగాణ బడ్జెట్ సమావేశాలుంటాయి. తెలంగాణ బడ్జెట్ వాస్తవ అంచనాలకు అనుగుణంగా ఉండాలని అధికారులకు చెప్పాం.

Daily telugu Daily trending news Breaking news telugu Telugu news Telugu stories Crime News Politics news Current Affairs pdf Today Latest headlines

 అంచనాలకు మించి ఊహాజనిత లెక్కలతో బడ్జెట్ ఉండకూడని అధికారులను ఆదేశాలు ఇచ్చాం. మండలాలు రెవెన్యూ డివిజన్ విషయంపై అసెంబ్లీలో చర్చించి కమిషన్ ఏర్పా చేస్తాం. కాళేశ్వరం సంబంధించిన వాస్తవాలను కూడా అసెంబ్లీ ముందుకు తెస్తాం. చర్చల తర్వాత డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక, నిపుణుల సూచన మేరకు ముందుకు వెళ్తాం” అన్నారు.

లాభాల్లో ఆర్టీసీ..

మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల రెవెన్యూ పెరిగింది. ఆర్టీసీకి ప్రతి నెలా రూ.350 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లిస్తోంది. 30శాతం నుంచి ఆక్యుపెన్సీ రేషియో 80 శాతానికి పెరిగింది. తద్వారా ఆర్టీసీకి నిర్వహణ నష్టాలు తగ్గాయి. గత అప్పులతో సంబంధం లేకుండా చుస్తే కాంగ్రెస్ప్రభుత్వం వచ్చాక లాభాలతో ఆర్టీసీ నడుస్తోంది. రాష్ట్ర ఖజానాకు ఆర్థిక భారం ఉన్నా సరే.. సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. బీసీ కమిషన్ పదవీకాలం ఆగస్టుతో పూర్తవుతుంది. కొత్త వారిని నియమించిన తరువాత కుల గణన చేస్తాం.

రుణభారం తగ్గించుకునే పనిలో ఉన్నాం

రాష్ట్రం రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ప్రతి నెల రూ. 7వేల కోట్ల అప్పులు కడుతున్నాం. రాష్ట్రం విడిపోయినప్పుడు నెలకు రూ. 6,500 కోట్లు కట్టేవారు. గత ప్రభుత్వం 7 నుంచి 11 శాతం వడ్డీతో రుణాలు తెచ్చారు. రుణభారం తగ్గేలా రుణాల వడ్డీని తగ్గించుకునే పనిలో ఉన్నాం. ఒక్కశాతం తగ్గినా రూ.700 కోట్లు ఆదా అవుతాయి. ఈమేరకు కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నాం. బడ్జెట్కు ముందే రాష్ట్రానికి కావాల్సిన అంశాలను కేంద్రం దృష్టిలో ఉంచి ఎక్కువ నిధులు పొందే ప్రయత్నం చేస్తున్నాం. అన్ని శాఖలకు సంబంధించిన రాష్ట్ర మంత్రులు.. కేంద్రమంత్రులను ఇప్పటికే ఒకసారి కలిశారు" అని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.

Comments

-Advertisement-