-Advertisement-

AP Cabinet List: 24 మంది మంత్రుల జాబితా విడుదల.. సగానికి పైగా కొత్త వారే.!

Ap Cabinet minister list Ap Ministers list pdf Andhra Pradesh ministers list Ap BJP minister Janasena ministers TDP ministers Kapu ministers Political
Peoples Motivation

AP Cabinet List: 24 మంది మంత్రుల జాబితా విడుదల.. సగానికి పైగా కొత్త వారే.!

ఏపీ మంత్రివర్గంలో 17 మంది కొత్తవారే

జనసేనకు 3, బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయించిన చంద్రబాబు

సగానికిపైగా కొత్తవారికి అవకాశం

అన్ని విధాల సమతూకం ఉండేలా మంత్రి వర్గాన్ని రూపొందించిన టీడీపీ అధినేత

టీడీపీ నుంచి నారా లోకేశ్‌, వంగలపూడి అనిత సహ పలువురు సీనియర్లకు ఛాన్స్ 

అమరావతి (పీపుల్స్ మోటివేషన్):-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరికొన్ని గంటల్లో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఉదయం 11.47 నిమిషాలకు ప్రమాణం చేసి రాష్ట్ర పగ్గాలు చేపట్టనున్నారు. ఇక ఆయనతో పాటు నేడు ప్రమాణం చేయనున్న మంత్రుల జాబితా కూడా విడుదలైంది. జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పవన్‌‌తో పాటు మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక ప్రకటించారు. వీరంతా నేడు ప్రమాణం చేయనున్నారు. 

Ap Cabinet minister list Ap Ministers list pdf Andhra Pradesh ministers list Ap BJP minister Janasena ministers TDP ministers Kapu ministers Political

జనసేనకు 3 మంత్రి పదవులు..

జనసేనకు మూడు మంత్రి పదవులను కేటాయించారు. ఇక బీజేపీకి ఒక బెర్త్ కేటాయించారు. ఒక స్థానాన్ని ఖాళీగా ఉంచారు. మంత్రివర్గంలో సగానికిపైగా కొత్తవారే ఉన్నారు. 17 మంది కొత్తవారికి ఛాన్స్ ఇచ్చారు. సామాజిక వర్గాలవారీగా చూస్తే.. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లకు చోటిచ్చారు. ముగ్గురు మహిళలు, బీసీలు 8 మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం కల్పించారు. మొత్తంగా సీనియర్లు, యువ నాయకుల మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని ఎంచుకున్నారు. ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథిలకు ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకున్నారు. 

కాగా మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు తీవ్ర కసరత్తు చేశారని కూటమి వర్గాలు చెబుతున్నాయి. కొన్ని రోజులుగా ఆయన విస్తృత కసరత్తు చేశారని వెల్లడించాయి. సామాజిక వర్గాలు, ప్రాంతాలు, వివిధ వర్గాల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గాన్ని రూపొందించారని సమాచారం.

కొత్త మంత్రుల జాబితా ఇదే

1. కొణిదెల పవన్ కల్యాణ్- పీఠాపురం ( జనసేన )

2. నారా లోకేశ్- మంగళగిరి 

3. కింజరాపు అచ్చెన్నాయుడు- టెక్కలి 

4. కొల్లు రవీంద్ర- బంధరు

5. నాదెండ్ల మనోహర్- తెనాలి ( జనసేన )

6. పొంగూరు నారాయణ- నెల్లూరు సిటీ

7. అనిత వంగలపూడి-పాయకరావుపేట

8. సత్యకుమార్ యాదవ్- ధర్మవరం ( బీజేపీ )

9. నిమ్మల రామానాయుడు-పాలకొల్లు

10. ఎన్ఎండీ ఫరూక్-నంద్యాల

11. ఆనం రామనారాయణరెడ్డి-ఆత్మకూరు

12. పయ్యావుల కేశవ్-ఉరవకొండ

13. అనగాని సత్యప్రసాద్-రేపల్లె

14. కొలుసు పార్థసారథి-నూజివీడు

15. డోలా బాల వీరాంజనేయస్వామి-కొండపి

16. గొట్టిపాటి రవికుమార్-అద్దంకి

17. కందుల దుర్గేశ్-నిడదవోలు ( జనసేన )

18. గుమ్మడి సంధ్యారాణి-సాలూరు

19. బీసీ జనార్ధన రెడ్డి-బనగానపల్లె

20. టీజీ భరత్-కర్నూలు

21. ఎస్. సవిత-పెనుగొండ

22. వాసంశెట్టి సుభాష్-రామచంద్రాపురం

23. కొండపల్లి శ్రీనివాస్-గజపతినగరం

24. ముండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి-రాయచోటి

Comments

-Advertisement-