AP CM Chandrababu Naidu: జనసేనకు కేటాయించనున్న శాఖలు ఇవేనా..?
AP CM Chandrababu Naidu: జనసేనకు కేటాయించనున్న శాఖలు ఇవేనా..?
- ఏపీ మంత్రుల శాఖల కేటాయింపు దాదాపు పూర్తి..
- నేడు అమరావతికి తిరిగొచ్చాక శాఖల కేటాయింపును ప్రకటించనున్న సీఎం చంద్రబాబు..
- పవన్ కల్యాణ్‌కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించినట్టు సమాచారం..
అమరావతి (పీపుల్స్ మోటివేషన్):-
నిన్న ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ప్రమాణస్వీకారం తర్వాత చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల దర్శనానికి వెళ్లారు. మంత్రుల శాఖల కేటాయింపు దాదాపు పూర్తి చేశారని నేడు అమరావతికి తిరిగొచ్చాక శాఖల కేటాయింపును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు పవన్ కల్యాణ్‌కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించినట్టు సమాచారం ఆంధ్రప్రదేశ్ మంత్రులకు శాఖల కేటాయింపు కసరత్తును ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలుస్తోంది. గురువారం ఆయన తిరుపతి నుంచి అమరావతికి తిరిగి వచ్చాక ఎవరికి ఏ శాఖలు కేటాయించిందీ ప్రకటించనున్నారు. పవన్ కల్యాణ్‌ను ఉపముఖ్యమంత్రిని చేయడంతో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్టు తెలిసింది. నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేశ్‌కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్టు తెలిసింది. పవన్ కోరిక మేరకు గ్రామీణ నేపథ్యంలో ఉన్న శాఖను కేటాయించారని తెలుస్తోంది. లోకేశ్‌కు కూడా కీలక శాఖను కేటాయించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.