WHO: 2024లో భారత్లో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదు-W.H.O
2024లో భారత్లో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదు
భారత్లో 2019 తర్వాత రెండో బర్ట్ ఫ్లూ కేసు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organ- ization) ఇటీవల వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నాలుగేళ్ల చిన్నారి హెచ్9ఎన్2 రకం వైరస్ ( H9N2 virus) బారిన పడినట్లు తెలిపింది. ఇప్పటికే భారత్ (2019లో తొలి కేసు), చైనా, మెక్సికో, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మనుషుల్లో బర్ట్ ఫ్లూ కేసులు నమోదైయ్యాయి. ఇటీవల, మెక్సికోలో అయితే మానవ బర్డ్ ఫ్లూ మరణం కూడా సంభవించింది.
బర్డ్ ఫ్లూ:
బర్డ్ ఫ్లూ అనేది ఒక అంటువ్యాధి. ఇది పెంపుడు కోళ్లు, అడవి పక్షులకు సంబంధించిన వ్యాధి. 100 సంవత్సరాలుగా ఇది ఉనికిలో ఉంది. సాధారణంగా శరదృతువులో ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. తర్వాత దీని వ్యాప్తి తగ్గుతుంది.
మొదట యూరప్, ఆసియాల్లోని బాతుల్లో ఈ వ్యాధి మొదలైంది. తరువాత ఇతర పక్షులకు వ్యాపించిందని ఎడిన్బర్గ్ యూనివర్సిటీలోని రోప్లిన్ ఇన్స్టిట్యూట్ వైరాలజీ ప్రొఫెసర్ పాల్ డిగార్డ్ చెప్పారు. అయితే, ఇటీవల కాలంలో మనుషులకు కూడా సోకుతుంది. ఇప్పుడు అత్యంత ప్రబలంగా ఉన్న హెచ్5ఎన్1 వైరస్ను తొలుత 1996లో చైనాలో గుర్తించారు. తర్వాత ఇది యూరప్, అమెరికా, ఇప్పుడు ఆస్ట్రేలియా, మరియు ఇతర దేశాలకు ఎప్పుడూ లేనంత తీవ్రంగా ఇప్పుడు బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతుంది