-Advertisement-

AP DGP: ఏపీ కొత్త‌ డీజీపీగా ద్వార‌కా తిరుమ‌ల‌రావు..సీనియారిటీలో అగ్రస్థానం

General news Telugu daily News Interesting news Daily Telugu news Breaking news Breaking news Telugu daily political updates latest crime news AP news
Pavani

DGP: ఏపీ కొత్త‌ డీజీపీగా ద్వార‌కా తిరుమ‌ల‌రావు..సీనియారిటీలో అగ్రస్థానం

ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన‌ సీఎస్ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌..

అంత‌కుముందు డీజీపీగా ఉన్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు..

అనూహ్యంగా హరీష్ కుమార్ గుప్తాకు ఏపీ పోలీస్ బాస్‌గా అవ‌కాశం..

ఇప్పుడు కొత్త‌ ప్ర‌భుత్వం హరీష్ కుమార్ స్థానంలో తిరుమ‌ల‌రావును నియ‌మించిన వైనం.. 

1989 బ్యాచ్ ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారి తిరుమ‌ల‌రావు..

ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న తిరుమలరావు..

General news Telugu daily News Interesting news Daily Telugu news Breaking news Breaking news Telugu daily political updates latest crime news AP news
అమరావతి: రాష్ట్ర నూతన డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన్ను కో ఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించి పోలీసు దళాల అధిపతిగా (హెచ్ఐపీఎఫ్)గా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్కుమార్ ప్రసాద్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారుల సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. కర్నూలు ఏఎస్పీగా మొట్టమొదటి పోస్టింగ్ చేపట్టారు. తర్వాత కామారెడ్డి, ధర్మవరంలో ఏఎస్పీగా పనిచేశారు. నిజామాబాద్ జిల్లా ఆపరేషన్స్ విభాగం అదనపు ఎస్పీగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఎస్పీగా పదోన్నతి పొందాక... అనంతపు కడప, మెదక్ జిల్లాలతో పాటు విజయవాడ రైల్వే, సీఐడీ, సీబీఐ విభాగాల్లో ఎస్పీగా పనిచేశారు. అనంతపురం,

నెలన్నర పాటు డీజీపీగా కొనసాగిన హరీష్ గుప్తా

వైకాపాతో అంటకాగుతున్నారన్న ఫిర్యాదులపై సార్వత్రిక ఎన్నికల సమయంలో కేవీ రాజేంద్రనాథరెడ్డిపై బదిలీ వేటు వేసిన ఎన్నికల సంఘం... హరీష్కుమార్ గుప్తాను డీజీపీ నియమించింది. మే 6న డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీష్కుమార్ గుప్తా దాదాపు నెలన్నర పాటు ఆ పోస్టులో కొనసాగారు. ఇటీవల చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా ట్రాఫిక్ను సరిగ్గా నియంత్రించకపోవడంతో అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వాహనం ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. ఆయన ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి వెళ్లలేకపోయారు. ఈ వ్యవహారంలో డీజీపీ తీరుపై గవర్నర్ కొంత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. వీటితోపాటు సీనియారిటీని దృష్టిలో పెట్టుకునిద్వారకా తిరుమలరావుకు డీజీపీగా అవకాశం కల్పించినట్లు సమాచారం.

Comments

-Advertisement-