-Advertisement-

TGPSC: షెడ్యూల్‌ ప్రకారమే గ్రూప్స్‌ పరీక్షల నిర్వహణ.. ఎలాంటి మార్పు ఉండదు

TGPSC GROUP 2 TGPSC HWO hall tickets TGPSC GROUP 2 EDIT OPTION TSPSC GROUP 2 EDIT OPTION TSPSC HWO HALL TICKETS APPSC GROUP 2 WEB OPTIONS GROUP 2 EXAM
Janu

TGPSC: షెడ్యూల్‌ ప్రకారమే గ్రూప్స్‌ పరీక్షల నిర్వహణ.. ఎలాంటి మార్పు ఉండదు. 

అక్టోబర్‌ 21 నుంచి గ్రూప్‌-1 మెయిన్‌.. ఆగస్టు 7, 8న గ్రూప్‌-2, నవంబర్‌ 17, 18న గ్రూప్‌-3 పరీక్షలనిర్వహణ..

త్వరలోనే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాలు..

కసరత్తు చేస్తున్న తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌..

పోస్టులు పెంచాలంటూ నిరుద్యోగుల డిమాండ్‌..

కొన్ని రోజులుగా కొనసాగుతున్న నిరసనలు..

డిమాండ్ల సాధనకు నేడు ఇందిరాపార్కు వద్ద ధర్నా..

హైదరాబాద్‌, జూన్‌ 19 (పీపుల్స్ మోటివేషన్):- ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌-1 మెయిన్‌, గ్రూప్‌-2, గ్రూప్‌-3 పరీక్షలనుషెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించడానికి టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 9న నిర్వహించిన ప్రిలిమ్స్‌ ఫలితాలు త్వరలోనే విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నది.

TGPSC group 2 TGPSC login TGPSC Exam date job News current affairs Telugu news TGPSC exam result TS DSC TS TET government jobs  tgpsc group 2

అనంతరం గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షలు అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు నిర్వహించనున్నది. గ్రూప్‌-1లోని 563 పోస్టుల కోసం 4.03 లక్షల మంది ప్రిలిమ్స్‌కు దరఖాస్తు చేసుకోగా, 3లక్షల మంది హాజరైనట్టు సమాచారం. ప్రిలిమ్స్‌ ఫలితాల్లో 1:50 నిష్పత్తి ప్రకారం మెయిన్‌కు అభ్యర్థుల ఎంపిక కొనసాగుతున్నది.

2022 లో విడుదలైన గ్రూప్‌-2 నోటిఫికేషన్‌లో 783 ఖాళీలు ప్రకటించారు. గ్రూప్‌-2 పోస్టులకు ఆగస్టు 7, 8న రాతపరీక్షలు నిర్వహించనున్నారు. నవంబర్‌ 17, 18న గ్రూప్‌-3 పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నోటిఫికేషన్‌లో 1388 పోస్టులు ప్రకటించారు.

1:100 నిష్పత్తి పాటించాలి

షెడ్యూల్‌ ప్రకారమే గ్రూప్స్‌ పరీక్షలు నిర్వహించడానికి అధికారులు సిద్ధమవుతుంటే, నిరుద్యోగుల్లో ఉత్కంఠ పెరుగుతుంది. గ్రూప్‌-2, గ్రూప్‌-3లో రాత పరీక్షలు నిర్వహించలేదు. ఈలోపే గ్రూప్‌-2లో 2000, గ్రూప్‌-3లో 3000 వరకు పోస్టులు పెంచాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. గ్రూప్‌-1 మెయిన్‌కు 1:100 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఎంపిక చే యాలని కోరుతున్నారు. అదనపు పోస్టు లు పెంచాలని పేర్కొన్నారు. డిమాండ్ల సాధనకు నేడు నిరుద్యోగులు ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించనున్నారు.

Comments

-Advertisement-