AP DSC: ఏపీ టెట్ పలితాలు విడుదలయ్యేనా..?? డీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థుల్లో అయోమయం.!!
AP DSc: ఏపీ టెట్ పలితాలు విడుదలయ్యేనా..?? డీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థుల్లో అయోమయం.!!
ఇటీవలే ఏపీ సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీ పై సంతకం చేసి నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. అలాగే గత ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేస్తూ కొత్త డీఎస్సీ కి ప్రస్తుత ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. కానీ ఈ సంవత్సరమే గత ప్రభుత్వం ఫిబ్రవరిలో టెట్ నిర్వహించినప్పటికీ ఫలితాలు విడుదల చేయడంలో జాప్యం జరగడంతో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడం తర్వాత ఫలితాలు విడుదలకు ఎన్నికల కమిషన్ నో చెప్పడంతో అది కాస్త విడుదల అవ్వలేదు. తరువాత జరిగిన పరిణామాలతో ఎన్నికల తరువాత ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వం చేసిన డీఎస్సీ ని రద్దు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం మెగా డీఎస్సీ ని ప్రకటించింది. అభ్యర్థులు ఇప్పటికే రాసిన టెట్ ఫలితాలు విడుదల చేస్తారా లేదా రద్దుచేసి మరలా టెట్ నిర్వహిస్తారా లేదా టెట్ కమ్ టిఆర్టీ నిర్వహిస్తారా అనే అయోమయంలో ఉన్నట్లు కొంతమంది అభ్యర్థులు తెలియజేశారు. దీనిపై ప్రభుత్వం త్వరగా స్పందించి ఒక విధానాన్ని ప్రకటించాలని అభ్యర్థులు కోరుతున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫిబ్రవరి 27వ తేదీ నుంచి జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మార్చి 3వ తేదీ వరకు జరిగిన పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీలతోపాటు రెస్పాన్స్ షీట్లను కూడా విద్యా శాఖ విడుదల చేసింది. కానీ టెట్ ఫలితాలను షెడ్యూలు ప్రకారం అయితే మార్చి 14వ తేదీన వెల్లడి కావలసి ఉంది. అయితే అధికారులు ఆ షెడ్యూల్ ప్రకారం విడుదల చేయలేదు. ఈలోపు మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఇప్పుడు ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాగానే ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.