AP EAMCET RESULTS# ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
AP EAMCET RESULTS# ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-
ఏపీ ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలను మంగళవారం సాయంత్రం 4 గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నట్లు సెట్ ఛైర్మన్, జేఎన్ టీయూ-కాకినాడ వీసీ ప్రసాదరాజు తెలిపారు. ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యా మండలి ఇన్ఛార్జి ఛైర్మన్ రామ్మోహన్ రావుతో కలిసి ఫలితాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఈఏపీసెట్ ను జేఎన్టీయూ- కాకినాడ నిర్వహించింది. మొత్తం 3,62,851 మంది దరఖాస్తు చేయగా.. వారిలో 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్ కు సంబంధించి 2,58,373 మంది, వ్యవసాయ, ఫార్మసీ విభాగాలకు కలిపి 80,766 మంది పరీక్షలు రాశారు. ఫలితాలను కింది వెబ్సైట్ లో పొందవచ్చు. ఈఏపీసె ట్లో ఇంటర్మీడియట్ మార్కులకు 25% వెయిటేజీ ఉంటుంది. దీని ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తారు.
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి