-Advertisement-

AP Govt: ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు శుభవార్త..!

Telugu news Daily news Trending news Latest Telugu news Interesting news Breaking Telugu news govt jobs ssc jobs Intermediate students free books AP
Pavani

AP Govt: ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు శుభవార్త..!

ప్రభుత్వ కాలేజీల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు..

నోడల్ ఆఫీసర్ నియామకం..

తెలుగు అకాడమీ నుంచి టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్, బ్యాగులు సరఫరా..

అమరావతి, జూన్ 18 (పీపుల్స్ మోటివేషన్):-

ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వ శుభవార్త చెప్పింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. 

Telugu news Daily news Trending news Latest Telugu news Interesting news Breaking Telugu news govt jobs ssc jobs current affairs

ప్రభుత్వ కాలేజీలతో పాటు కేజీబీవీలు, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ గురుకుల పాఠశాలలు, హైస్కూల్ ప్లస్ లలో చదివే విద్యార్థులకు ఉచితంగా టెక్ట్స్ బుక్ లు పంపిణీ చేయనున్నారు. సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ను ఈ ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ పథకానికి నోడల్ ఆఫీసర్ గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, టెక్ట్స్ బుక్స్ తో పాటు నోట్ బుక్ లు, బ్యాగ్ లను తెలుగు అకాడమీ నుంచి సరఫరా చేయనున్నారు.

Comments

-Advertisement-