AP Govt: ఏపీ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. వారానికి ఐదు రోజుల పని దినాలు పొడిగింపు..!
AP Govt: ఏపీ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. వారానికి ఐదు రోజుల పని దినాలు పొడిగింపు..!
సచివాలయం.. వివిధ హెచ్వోడీల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు గుడ్స్యూస్..
ఐదు రోజుల పనిదినాన్ని పొగిడిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం..
ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్..
నేటి నుంచి ఏడాది పాటు అమల్లో ఉండనున్న వారానికి ఐదు రోజుల పని విధానం..
అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-
సచివాలయంతో పాటు.. వివిధ హెచ్ఓడీల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు గుడ్స్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పటికే అమల్లో ఉన్న వారానికి ఐదు రోజుల పనిదినాన్ని పొగిడిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది.. ఏపీ సచివాలయంతో పాటు హెచ్వోడీల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ వెసులుబాటు ఉండనుంది.. దీనిపై ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్.. ఇవాల్టి నుంచి వారానికి ఐదు రోజుల పనివిధానం అమల్లోకి వస్తుందని.. నేటి నుంచి ఏడాది పాటు వారానికి ఐదు రోజుల పని విధానం అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సీఎస్.
కాగా, రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లిన సచివాలయ ఉద్యోగుల కోసం అప్పడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు.. కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించారు.. రాజధానిలో క్వార్టర్స్తో పాటు ఐదు రోజులు మాత్రమే పనిచేసేలా వెసులుబాటు ఇచ్చారు.. విభజన తర్వాత హైదరాబాద్లోనే తమ కుటుంబాలు ఉండడంతో.. సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేసిన ఉద్యోగులు.. ఆ ర్వాత హైదరాబాద్కు వచ్చి వారి కుటుంబాలతో గడిపేవారు. రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పించాలనుకున్నారు.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ విధానాన్ని ఎత్తివేయాలనే ఆలోచన చేసింది.. కానీ, ఉద్యోగుల విజ్ఞప్తితో ఆ వెసులుబాటును కొనసాగించింది.. అమరావతి నిర్మాణం అగిపోయినా.. ఉద్యోగుల ఐదు రోజుల పనివిధానం కొనసాగుతూ రాగా.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్లీ అమరావతి రాజధానిపై వేగంగా అడుగులు వేస్తోంది.. మరోవైపు.. సచివాలయ ఉద్యోగులకు గతంలో కల్పించిన ఐదు రోజుల పని దినాల వెసులుబాటు త్వరలోనే ముగియనున్న నేపథ్యంలో.. ఐదు రోజుల పని దినాలను మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు సర్కార్.