AP Govt: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలి సంతకం దేనిపైనా..!
AP Govt: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలి సంతకం దేనిపైనా..!
ఉపాధి హామీ పథకాన్ని ఉద్యాన వన సంబంధిత పనులకు అనుసంధానించి నిధుల మంజూరుపై తొలి సంతకం ..
గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణంపై రెండో సంతకం..
2019లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జనసేనాని..
విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రెండు ఫైళ్లపై మంత్రి హోదాలో ఆయన సంతకాలు చేశారు.
ఉపాధి హామీ పథకాన్ని ఉద్యాన వన సంబంధిత పనులకు అనుసంధానించి నిధుల మంజూరుపై తొలి సంతకం చేశారు. ఆ తర్వాత గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణంపై రెండో సంతకం చేశారు. ఇక 2019లో ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. జాతీయ 'ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం. ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టబోతున్నాం. మహిళా దినోత్సవం రోజును పురష్కరించుకుని రైతులకు జనసేన ఇస్తున్న మాట ఇది. రైతు ఆడపడుచుల విన్నపాలు అందిన తరువాత వచ్చిన ఆలోచనే ఇది' అని 2019లో మహిళా దినోత్సవ వేడుకల్లో జనసేనాని మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాటను పవన్ కల్యాణ్ నిలబెట్టుకున్నారు.