-Advertisement-

Pensions: జులైలో ఒక్కొక్కరికి రూ. 7 వేలు.. పింఛన్ల పెంపుపై ఉత్తర్వులు జారీచేసిన ఏపీ ప్రభుత్వం

Pension amount in ap Telugu news daily news trending news latest Telugu news daily news intresting facts breaking news pension increase in ap news..
Priya

Pension: జులైలో ఒక్కొక్కరికి రూ. 7 వేలు.. పింఛన్ల పెంపుపై ఉత్తర్వులు జారీచేసిన ఏపీ ప్రభుత్వం

ముఖ్యమంత్రిగా చంద్రబాబు మూడో సంతకం పింఛన్ల పెంపుపైనే..

ఏప్రిల్ నుంచే ఇస్తామని టీడీపీ ఎన్నికల హామీ..

ఆ మేరకు మూడు నెలలకు ఒక్కో నెలకు రూ. 1000 చొప్పున కలిపి జులైలో మొత్తం రూ. 7 వేల పంపిణీ..

ఏపీలో పింఛన్ లబ్ధిదారులకు ఇది శుభవార్తే. జులై నుంచి వారు రూ. 4 వేల పెన్షన్ అందుకోనున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీల్లో ఒకటైన పింఛన్ల పెంపునకు సంబంధించిన ఫైలుపై నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మూడో సంతకం చేశారు. ప్రస్తుతం రూ. 3 వేల పెన్షన్ అందిస్తుండగా ఇకపై రూ. 4 వేలు అందించనున్నారు. ఫైల్‌పై చంద్రబాబు సంతకం చేయడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరభ్‌కుమార్ ప్రసాద్ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పథకానికి పెట్టిన ‘ఎన్టీఆర్ భరోసా’ పేరుతో ఈ పథకం ఇప్పుడు కొనసాగనుంది.

Pension amount in ap Telugu news daily news trending news latest Telugu news daily news intresting facts breaking news pension increase in ap news..


ఒక్కొక్కరికి రూ. 7 వేలు

తాము అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచి నెలకు రూ. 4 వేల పింఛను ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో జులై 1న ఒక్కొక్కరికి రూ. 7 వేల చొప్పున పెన్షన్ అందిస్తారు. ఏప్రిల్, మే, జూన్‌లో చెల్లించాల్సిన ఒక్కో వెయ్యి రూపాయలతోపాటు జులై నెల పింఛన్ రూ. 4 వేలు కలిపి మొత్తం రూ. 7 వేలు అందిస్తారు. ఆగస్టు నుంచి మాత్రం రూ. 4 వేల చొప్పున పంపిణీ చేస్తారు.

లబ్ధిదారులు వీరే

రూ. 4 వేల పెన్షన్ అందుకునే లబ్ధిదారుల్లో వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవీ బాధితులు, కళాకారులు ఉన్నారు.

పెన్షన్ల పెంపు ఇలా

దివ్యాంగులకు ప్రస్తుతం రూ. 3 వేలు ఇస్తుండగా, ఇకపై రూ. 6 వేలు ఇవ్వనున్నారు. పూర్తిస్థాయిలో అస్వస్థతకు గురైన వారికి, అనారోగ్యంతో మంచానపడిన వారికి, వీల్‌చైర్‌లో ఉన్న వారికి ఇప్పటి వరకు అందిస్తున్న రూ. 5 వేల పెన్షన్ స్థానంలో ఇకపై రూ. 15 వేలు అందిస్తారు. అలాగే, కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేయించుకున్న వారికి, డయాలసిస్ స్టేజ్‌కు ముందున్న కిడ్నీ రోగులకు ఇస్తున్న రూ. 5 వేల పింఛనుకు బదులు రూ. 10 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. కుష్ఠువ్యాధి కారణంగా వైకల్యం పొందిన వారికి రూ. 6 వేలు ఇస్తారు.

Comments

-Advertisement-