Bike Safety: వర్షాకాలంలో మీ బైక్ పాడవకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి..!
Bike Safety: వర్షాకాలంలో మీ బైక్ పాడవకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి..!
- వర్షాకాలంలో బైక్ కి ఎక్స్‌ట్రా కేర్ అవసరం
- నీటిలో తడిచి వాటి భాగాలు నాశనమవుతాయి
- ద్విచక్రవాహనానికి ఎలాంటి సమస్య రాకుండా ఉంటాలంటే ఇలా చేయండి
వర్షాకాలం మొదలైంది. ఈ సమయంలో బైక్‌లపై లాంగ్ డ్రైవ్‌లు వెళ్లడానికి కొందుకు ఇష్ట పడుతుంటారు. రోజువారీ అవసరాలకు బైక్‌పై తిరిగే వారు మాత్రం అసౌకర్యాలు ఎదుర్కొంటారు. అయితే ఈ సీజన్‌లో ఎవరైనా సరే వాహనాలను జాగ్రత్తగా చూసుకోవాలి. వర్షంలో తడిస్తే, వాటి పనితీరు చెక్ చేసుకోవాలి. లేకపోతే వాటిని బాగు చేయించడానికి డబ్బు ఖర్చు పెట్టక తప్పదు. కారు, బైక్, స్కూటర్‌లకు వర్షాకాలంలో ఎక్స్‌ట్రా కేర్ అవసరం. ఎందుకంటే అవి మెటల్, ప్లాస్టిక్, అనేక ఇతర భాగాలతో తయారు చేసి ఉంటారు. ఈ నేపథ్యంలో వర్షాల కారణంగా టూవీలర్స్‌కు ఎలాంటి సమస్యలు వస్తాయి, ఏం చేయాలనే విషయాలు తెలుసుకుందాం.
రోజూ మనకు ఎంతో ఉపయోగపడుతున్న మన వాహనాన్ని మనమే స్వయంగా పరిశీలించి, జాగ్రత్తగా చూసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా వర్షాకాలంలో బైక్ సెంటర్ స్టాండ్ వేస్తే ,ప్లేగ్ లొకి వాటర్ చేరుకోదు. అదే విధంగా పిటి క్యాప్, ట్యాంక్ కవర్ లేకపోతే వర్షపు నీరు పొయ్యి స్టార్టింగ్ ట్రబుల్ వస్తుందని మెకానికులు చెప్తున్నారు. ఇంజిన్ నుంచి చక్రాలకు శక్తినిచ్చేది చైన్. ఇది సరిగ్గా లేకపోతే చాలా ప్రమాదకరం. రైడ్కి వెళ్లొచ్చిన వెంటనే చైన్లో ప్రాబ్లమ్ ఉందని గమనిస్తే.. అప్పుడే చైన్ కి ఆయిల్ వేయడం ఉత్తమం. ఎందుకంటే ఆ సమయంలో వేడిగా ఉంటుంది. లింక్లన్నింటికీ ఆయిల్ త్వరగా చేరుతుంది. ఇలా చేయడం వల్ల చైన్ లైఫ్ పెరుగుతుంది. బైక్ ఇంజిన్లో ఆయిల్ స్థాయిని సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.
వర్షానికి తడిసేలా ఉన్న ప్రాంతంలో టూ వీలర్‌ను పార్క్ చేయకూడదు. వర్షపు నీటికి దూరంగా, షెల్టర్ ఏరియాలో పార్క్ చేయడం మంచిది. వాహనంలోని వివిధ భాగాలలో నీరు చేరకుండా ఉంటుంది. అంతేకాకుండా వాటర్‌ప్రూఫ్ కవర్స్ ఉపయోగిస్తే భారీ వర్షం నుంచి అదనపు రక్షణ అందించవచ్చు. వర్షాకాలంలో రోడ్లు ఎక్కువగా జారిపోయే స్వభావం కలిగి ఉంటాయి. అందువల్ల ఈ కాలంలో బైక్ టైర్లు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. టైర్లు పూర్తిగా అరిగిపోయినట్లయితే.. వర్షాకాలం పూర్తిగా ప్రారంభమయ్యే లోపలే కొత్త టైర్లను అమర్చుకోవడం చాలా ఉత్తమం. టైర్ కనీసం 2 మీ.మీ కంటే ఎక్కువ త్రెడ్డింగ్ ఉండేలా చూసుకోవాలి.
వేడిగా ఉన్న బైక్లో గేజ్ను చెక్ చేయండి. పూర్తిగా లేదనిపిస్తే కొంచెం నింపుకోవడం బెటర్. ఇక ఆయిల్ నల్లగా కనిపిస్తే దాన్ని మార్చడం చాలా ముఖ్యం.5,000 కిమీ దాటితే మోటార్‌సైకిళ్ల ఎయిర్ ఫిల్టర్‌లు మార్చేయడం మంచిది. దుమ్ము మార్గాలు, ఇసుక ఉన్న ప్రాంతాల్లో నడిపుతున్నట్లయితే ఎయిర్ ఫిల్టర్‌ను వారం, నెలకొకసారి శుభ్రపరచాలి. మీ ఎయిర్ ఫిల్టర్ను చెక్ చేయాలంటే.. ఎయిర్‌బాక్స్‌ని ఎత్తి ఫిల్టర్‌ను వేరు చేయండి. మురికిగా కనిపిస్తే దాన్ని శుభ్రం చేయండి. కొద్ది రోజులకే మార్చేస్తే మేలు. ఈ నియమాలు పాటించి బైక్ ను సురక్షితంగా ఉంచుకోండి.