Black Tea : ఉదయన్నే బ్లాక్ టీని తాగుతున్నారా? ఎంత డేంజరో తెలుసా?
Black Tea : ఉదయన్నే బ్లాక్ టీని తాగుతున్నారా? ఎంత డేంజరో తెలుసా?
చాలా మందికి పొద్దున్నే లేవగానే టీ కాఫీ తాగే అలవాటు ఉంటుంది.. వేడిగా చుక్క గొంతులో పడకుంటే పొద్దు పొడవదు.. అయితే కొంతమంది టీ లేదా కాఫీని తాగుతారు.. మరికొందరు బ్లాక్ కాఫీని తాగుతారు.. పొద్దున్నే పరగడుపున బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.. ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పరగడుపున బ్లాక్ టీని అస్సలు తాగొద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు.. పరగడుపునే బ్లాక్ టీ తాగడం వల్ల సాధారణ టీ కన్నా మన శరీరంలోకి ఎక్కువ కెఫీన్ వచ్చి చేరుతుంది.. ఎక్కువగా కేఫిన్ బాడిలో వచ్చి చేరితే నిద్రలేమి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.. దాంతో నిద్ర సరిగ్గా పట్టదు. నిద్ర సరిగ్గా పోకపోతే మళ్లీ అనేక అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉంటాయి… కోరి మరీ రోగాలను తెచ్చుకున్న వాళ్ళము అవుతాము..
పొద్దున్నే ఏమి తీసుకోకుండా బ్లాక్ టీని తాగడం వల్ల జీర్ణ సమస్యలు రావడంతో పాటుగా డీహైడ్రేషన్ సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంతో శరీరంలో ఉండే ద్రవాలు అన్నీ బయటకు వెళ్లిపోతాయి. ఇది ఎండదెబ్బకు కారణమవుతుంది. అలాగే కిడ్నీల పై కూడా సమస్యలు వచ్చే అవకాశాలు లేకపోలేదు.. ఇంకా అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.