Health news: మానసిక ఆరోగ్యం లేకుంటే శారీరక ఆరోగ్యం కోష్టమే.. తెలుసుకోండి!!
మానసిక ఆరోగ్యం లేకుంటే శారీరక ఆరోగ్యం కోష్టమే.. తెలుసుకోండి!!
మీరు మీ పనుల ఒత్తిడి కారణంగా ఇతరులపై అసహనానికి గురవడం లేదా ఇతరులపై కోపం చూపించడం చేస్తున్నారా? ఒత్తిడి కారణంగా మానసిక సమతుల్యత దెబ్బ తింటుంది. అసహనం కాస్త పెరిగి పెరిగి మానసిక రుగ్మతగా మారుతుంది. ఫలితంగా శారీరక ఆరోగ్యం దెబ్బ తింటుంది. మీపై మీరే ఆత్మవిశ్వాసం కోల్పోవడం మానసిక సమస్యలకు కారణం అవుతుంది.
నగరాలు విస్తరిస్తుండడం, ఆధునిక వసతులు అందుబాటులోకి వస్తుండడం, చాలామంది సొంతూళ్లు, నగరాలను వీడి కొత్త నగరాలకు మారుతుండడం వంటివన్నీ ప్రజల మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయని, ఈ క్రమంలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు కుంగుబాటుకు దారితీయొచ్చని చెబుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అల్లీడ్ సైన్సెస్(ఐహెచ్బీఏఎస్) డైరెక్టర్ దీనిపై కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, భారత్లో పాశ్చ్యాత్తీకరణ శరవేగంగా జరుగుతుండడంతో కొత్త సాంకేతికతల ఆవిర్భావం కూడా ఒత్తిళ్లకు కారణం కావొచ్చని చెప్తున్నారు. అందుకే సరైన అభివృద్ధి కావాలా? సరైన మానసిక ఆరోగ్యం కావాలా అన్న ప్రశ్న ఉదయిస్తుందని ఆయన పేర్కొన్నారు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే శారీరక ఆరోగ్యం సాధ్యమవుతుందని అంటున్నారు.
రక ఆరోగ్యం కష్టమే.. తెలుసుకోండి!!
మానసికంగానూ ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరాన్ని ఇప్పుడు చాలా మంది వైద్యులు నొక్కి చెబుతున్నారు. మానసిక ఆరోగ్యం సరిగా లేకుంటే శారీరక ఆరోగ్యం కూడా దెబ్బ తింటుంది. ఫలితంగా ఏ పని చెయ్యలేని స్థితికి మనిషి చేరుకుంటాడు. అందుకే మానసిక ఆరోగ్యంపై ప్రతీ ఒక్కరూ దృష్టి సారించాలి. నిత్యం ఒకే రకమైన, ప్రశాంతత లేని పని కారణంగా మొదటగా ఆ ప్రభావం తన మెదడు నుండి శరీరంలో ఉన్న ఇతర అవయవాల మీద పడే ప్రభావం ఎక్కువ వుంటుంది. ఎప్పుడు అయితే మానసికంగా మనిషి మెరుగ్గా ఉంటాడో, అప్పుడే శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మానసిక ఆరోగ్యం మెరుగు పడాలంటే ధ్యానం చెయ్యాల్సిన అవసరం ఉంది. ప్రతీ రోజూ మెడిటేషన్ తో మానసిక సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు.