-Advertisement-

ఢిల్లీలో నీటి ట్యాంకర్ల మాఫియా.. అధికారుల అలసత్వపై సుప్రీం ఆగ్రహం

Water crisis In delhi Delhi problems and solutions Environmental issues in Delhi water problems facing by Delhi.. Environmental issues in Delhi PDF
Priya

ఢిల్లీలో నీటి ట్యాంకర్ల మాఫియా..

అధికారుల అలసత్వపై సుప్రీం ఆగ్రహం 

న్యూఢిల్లీ, జూన్ 12 (పీపుల్స్ మోటివేషన్):

దేశ రాజధాని నగరం దిల్లీ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రజలు నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ట్యాంకర్ మాఫియా కట్టడికి, నీటి వృథాను అరికట్టడానికి ఆప్ నేతృత్వంలోని దిల్లీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి మిగులుజలాలు విడుదల కోరుతూ అరవింద్ కేజీవ్రాల్ ప్రభుత్వం చేసిన అభ్యర్థన నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. ట్యాంకర్ మాఫియా విస్తృతంగా కనిపిస్తోంది. ఆ నీటినంతా ఆ మాఫియా మింగేసింది.

Problems in Delhi today Delhi problems and solutions Environmental issues in Delhi water problems facing by Delhi.. Environmental issues in Delhi PDF


 నీరు వృథా అవుతోంది. దానిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి వస్తోన్న నీరు ఎటుపోతోంది? ప్రజలు బాధపడుతున్నారు. మీడియాలో ఆ దృశ్యాలను మేం చూస్తున్నాం. వేసవిలో నీటి ఎద్దడి పదేపదే ఎదురవుతుంటే.. వృథాను అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు?' అని ప్రశ్నించింది. కోర్టుముందు ఎందుకు అసత్య ప్రకటనలు చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోతే.. ఆ పని పోలీసులకు అప్పగిస్తామని వ్యాఖ్యానించింది. దీనిపై దిల్లీ తరఫు న్యాయవాది కోర్టులో తన వాదన వినిపించారు. నీటి వృథా కట్టడికి తీసుకుంటున్న చర్యలను వెల్లడించిన ఆయన.. వాటిపై ఒక అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. ఆ దిశగా వెంటనే నివేదికను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. తప్పుడు ప్రకటనలు చేస్తున్నారంటూ ఈ సందర్భంగా హిమాచల్ ప్రభుత్వాన్ని కూడా మందలించింది. అలాగే విచారణను గురువారానికి వాయిదా వేసింది. హరియాణా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి పొరుగు రాష్టాల్ర నుంచి అదనంగా నీరు అందించాలని కోరుతూ దిల్లీ ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హీట్వేవ్ కారణంగా కొద్దికాలంగా రాష్ట్రంలో నీటి డిమాండ్ గణనీయంగా పెరిగిందని తన పిటిషన్లో పేర్కొంది. హరియాణా, యూపీ, హిమాచల్తో తో సహా ఇతర రాష్టాల్ర నుంచి ఒక నెల పాటు అదనపు నీటిని విడుదల చేయాలని న్యాయస్థానాన్ని కోరింది. రాష్ట్రం నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న వేళ ఢిల్లీలో నిర్మాణ ప్రదేశాల్లో నీటి వినియోగం, వాహనాలను కడగడం వంటి వాటిపై ప్రభుత్వం నిషేధించింది. నీటిని వృథా చేసిన వారికి రూ. 2,000 జరిమానా విధిస్తామని పేర్కొంది.

Comments

-Advertisement-