కేవలం పది రోజుల్లోనే సీన్ మారిపోయింది..! తమ మాట వినుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.. కాటసాని
కేవలం పది రోజుల్లోనే సీన్ మారిపోయింది..! తమ మాట వినుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.. కాటసాని
ఏపీ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం
వైసీపీ ఓటమికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఓ కారణమన్న కాటసాని
జగన్, అధికారులు తమ మాట వినుంటే గెలిచి ఉండేవాళ్లమని వెల్లడి
కర్నూలు (పీపుల్స్ మోటివేషన్):-
ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి వైసీపీ నేతలు ఇంకా కోలుకున్నట్టు లేదు. వారిని ఇప్పటికీ ఓటమి బాధ వేధిస్తూనే ఉంది. అంత దారుణంగా ఎలా ఓడిపోయామన్నది వారికి అర్థం కాని విషయంలా మారింది. అయితే, కొందరు మాజీ ఎమ్మెల్యేలు తమ ఓటమికి దారితీసిన అంశాలు ఇవేనంటూ మీడియా ముందుకు వస్తున్నారు.
తాజాగా.. పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా స్పందించారు. పాణ్యం మాజీ ఎమ్యెల్యే మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వారి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కర్నూలు అర్బన్ 16 వార్డుల కార్పొరేటర్లు మరియు 16 వార్డులలోని పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు,కార్యకర్తలు.గత ఎన్నికల్లో తన తమ పార్టీ ఓటమికి కారణమైన అంశాల గురించి మరియు ఇక ముందు చేయాల్సిన కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది..
వైసీపీ ఓటమికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఓ కారణమని విశ్లేషించారు. దీనిపై టీడీపీ చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని, రైతుల భూములు లాగేసుకుంటారన్న ప్రచారం తమకు వ్యతిరేకంగా మారిందని కాటసాని అభిప్రాయపడ్డారు. కేవలం పది రోజుల్లోనే సీన్ మారిపోయిందని అన్నారు.
ఇసుక పాలసీ కూడా వైసీపీకి నష్టం కలుగజేసిందని తెలిపారు. ముఖ్యంగా... జగన్, అధికారులు తమ మాట వినుంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని, ఎన్నికల్లో గెలిచేవాళ్లమని కాటసాని రాంభూపాల్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.