పెట్రో-డాలర్ వార్తల్లో ఎందుకుంది:
పెట్రో-డాలర్ వార్తల్లో ఎందుకుంది:
> యూనైటెడ్ స్టేట్స్తో సౌదీ అరేబియా 50 సంవత్సరాల క్రితం చేసుకున్న "పెట్రో-డాలర్ ఒప్పందం" 2024 జూన్ 9తో ముగిసింది. ఈ ఒప్పందాన్ని ఇక పునరుద్దరించమని సౌదీ అరేబియా నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో, స్విట్జర్లాండ్ కు చెందిన "బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ సెంట్రల్ బ్యాంక్" డిజిటల్ కరెన్సీ ప్లాట్ ఫామ్ తో సౌదీ అరేబియా చేతులు కలిపింది.
ఒప్పందం నేపథ్యం:
> 1974 జూన్ 8న యునైటెడ్ స్టేట్స్, సౌదీ అరేబియా సంతకం చేసిన ఈ భద్రతా ఒప్పందం రెండు ఉమ్మడి కమిషన్లను ఏర్పాటు చేసింది. ఒకటి ఆర్థిక సహకారం, మరొకటి సౌదీ అరేబియా సైనిక అవసరాల కోసం ఏర్పాటు చేశారు.
> ఇది సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిని పెంచడానికి ప్రేరేపిస్తుందని అప్పట్లో అమెరికా అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. వాషింగ్టన్, ఇతర అరబ్ దేశాల మధ్య ఆర్ధిక సహకారాన్ని పెంపొందించడానికి దీన్ని ఒక బ్లూప్రింట్ గా భావించారు.
ఏంటి ఈ పెట్రో-డాలర్?
> చమురు ఎగుమతి చేసే దేశాలకు చెల్లించే యూఎస్ కరెన్సీని 'పెట్రో డాలర్' అని అంటారు.
> 1972లో బంగారం స్థానంలో యూఎస్ ఈ పెట్రో డాలర్ను తీసుకొచ్చింది. ఆర్థిక, సైనిక సహకారం కోసం సౌదీ 1974 జూన్ 8న యూఎస్తో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
> ఈ ఒప్పందం ప్రపంచ వాణిజ్యంపై యూఎస్ డాలర్ ఆధిపత్యం చెలాయించడంలో కీలక పాత్ర పోషించింది. డాలర్ డిమాండ్ ఆర్థిక స్థిరత్వం, లిక్విడిటీ వంటి అంశాల్లో యూఎస్ అబ్ధిపొందిందని విశ్లేషకులు చెబుతున్నారు.
పెట్రోడాలర్ ఒప్పందం ముగింపుకి కారణాలు:
> 1. యూఎస్ డాలర్ కాకుండా చైనీస్ ఆర్ఎంజీ, యూరోస్, యెన్, యువాన్ వంటి ఇతర కరెన్సీలలో చమురు అమ్మకాలను అనుమతించడం ద్వారా సౌదీ అరేబియా పెట్రోడోలార్ వ్యవస్థ మంచి దూరంగా వెళుతోంది. 1972లో ఏర్పాటైన ఈ వ్యవస్థ చమురు లావాదేవీలను ప్రత్యేకంగా అమెరికా డాలర్ తో ముడిపెట్టింది. ఇప్పుడు చమురు వాణిజ్యంలో ఇతర కరెన్సీలు ప్రాముఖ్యతను పొందుతాయి.
> 2. పెట్రోడాలర్ వ్యవస్థ చాలాకాలంగా యూఎస్ డాలర్ ప్రపంచంలో ప్రాథమిక రిజర్వ్ కరెన్సీ హోదాకు మద్దతు ఇస్తోంది. సౌదీ అరేబియా వైవిధ్యీకరణ యూఎస్ డాలర్ స్థానాన్ని బలహీనపరుస్తుంది. ఇది ప్రపంచ వాణిజ్యం, నిల్వల కోసం ఇతర కరెన్సీల వాడకాన్ని పెంచడానికి దారితీస్తుంది.
> 3. సౌదీ అరేబియా ప్రత్యేక డాలర్ లావాదేవీలకు దూరంగా ఉండటంతో డాలర్ కు డిమాండ్ తగ్గవచ్చు. ఇది దాని మారకం రేటు, ప్రపంచ కొనుగోలు శక్తిని ప్రభావితం చేస్తుంది.
> 4. సౌదీ అరేబియా "పెట్రోయువాన్" వైపు అడుగులు వేస్తే, అది డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బతీస్తుంది అంతర్జాతీయ వాణిజ్యంలో యువాన్ పాత్రను పెంచుతుంది.
> 5 సౌదీ అరేబియా బిట్ కాయిన్ వంటి డిజిటల్ కరెన్సీలను ప్రోత్సహించడం చెల్లింపు పద్ధతులను మరింత వైవిధ్యపరుస్తుంది. ఇది సాంప్రదాయ కరెన్సీలను ప్రభావితం చేస్తుంది.
అంతర్జాతీయంగా దీని ప్రభావం:
1. అంతర్జాతీయం డాలర్ పై తీవ్ర ప్రభావం చూపనుంది.
2. ఈ ఒప్పందం కనుక మారితే భౌగోళిక, ఆర్థిక, రాజకీయ, వాణిజ్య పరంగా చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది.
3. ఇది కాకుండా, గ్లోబల్ ఆయిల్ మార్కెట్ ధరల విధానాలు, ట్రేడింగ్ పద్ధతులలో మార్పులను కూడా వస్తాయి.
4. ప్రపంచ చమురు ధరలను, వ్యాపార విధానాలను ప్రభావితం అవకాశాలు కూడా అధికంగా ನ್ಯಾಯ.
5. గ్లోబల్ ఆయిల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లలో కొత్త ఆర్థిక సాధనాలు - సర్దుబాట్లను తీసుకువస్తుంది.
6. భౌగోళిక రాజకీయ సందర్బం ప్రకారం అభివృద్ధికి ఆటంకం ఏర్పడనుంది. అమెరికా-చైనా మధ్య విస్తృత పోటీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.