Golden Wings: నేవీ మహిళా పైలట్ కు తొలిసారిగా 'గోల్డెన్ వింగ్స్'
నేవీ మహిళా పైలట్ కు తొలిసారిగా 'గోల్డెన్ వింగ్స్'
హెలికాప్టర్ పైలట్ గా 22 వారాల పాటు శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన సబ్ లెఫ్టినెంట్ అనామిక రాజీవ్ "గోల్డెన్ వింగ్స్ పతీకాన్ని" ఈస్ట్రన్ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్, కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంథార్కర్ దీన్ని అందజేశారు.
అనామిక బి రాజీవ్ ప్రస్తుతం, భారత నౌకాదళంలో మహిళా పైలట్ గా విధులు నిర్వహిస్తున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా నేవీ హెలికాప్టర్ మహిళా పైలెట్ విభాగంలో ఈ పతకం దక్కడంతో ఈమె రికార్డు సృష్టించారు.
ఈమెతో పాటు లద్దాఫ్ నుంచి తొలి నేవీ కమిషన్డ్ ఆఫీసర్ గా జమ్ యాంగ్ త్సెవాంగ్ ఎంపికై మరో రికార్డు సృష్టించారు. 22 వారాల శిక్షణలో ప్రతిభ చూపించిన 21 మందికి ఈ పతకాల్ని బహూకరించారు. 2018లో భారత వైమానిక దళానికి చెందిన ఫ్లయింగ్ ఆఫీసర్ అవని చతుర్వేది యుద్ధ విమానాన్ని నడిపిన ఒంటరిగా నడిపిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమె తన మొదటి సోలో ఫ్లైట్ లో మిగ్-21 బైసన్ ను నడిపింది.
గత కొన్ని సంవత్సరాలుగా, త్రివిధ దళాల్లో కీలకమైన పోస్ట్ లలో మహిళా సిబ్బందిని నియమించడంపై దృష్టి సారించాయి. ERAD
గత సంవత్సరం చివర్లో, భారత నావికాదళం మహిళలకు కూడా ప్రాధాన్యతనిస్తూ "అన్ని పదవుల-అన్ని ర్యాంకులు" అనే వినాదం స్ఫూర్తితో భారత నౌకాదళానికి చెందిన నౌకలో "ప్రేరణ దేవస్థలీ"ని తొలి మహిళా కమాండింగ్ అధికారిని నియమించింది.